ఆరడుగుల బుల్లెట్ అని మనం పవన్ కళ్యాణ్ ని పిలుచుకున్నట్టే యావత్ దేశంలో ఎలాంటి హీరో పక్కనైన అదిరిపోయేలా సెట్ అయ్యే హీరోయిన్ టబుని కూడా అందరూ ఆరడుగుల చాక్లెట్ అని పిలుచుకుంటారు.అయితే ఈమె చూడ్డానికే అంత హైట్ గా కనిపిస్తారు.
బట్ ఈమె హైట్ కేవలం అయిదున్నర అడుగులే! కాకపోతే టబు గారు భాష ఏదైనా ఆమె అదిరిపోయే నటనతో, తన నాజూకైన నడుముతో, అందంతో, ఎంతోమంది అభిమానుల్ని తన బుట్టలో వేసుకుంది.టాలీవుడ్ తో మొదలుపెట్టి కోలీవుడ్, బాలివుడ్, హాలీవుడ్ వరకు ఎంతో విజయవంతంగా తన సినిమా ప్రయాణాన్ని కొనసాగించింది.

టబు నటనకి రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు దక్కాయంటే ఆమెని ప్రేక్షకులు ఎంతలా అభిమానించారో అర్ధం చేస్కోవచ్చు.అయితే టబు తన నిక్ నేమ్స్ తో కూడా రికార్డు సృష్టించింది.ఈమెకున్నన్ని ముద్దు పేర్లు ఇండియాలో ఏ హీరోయిన్ కి లేవు.అయితే ముందు టబు అసలు పేరు విషయానికి వస్తే ఆమె అసలు పేరు తబుస్సమ్ హస్మి.
కానీ ఆమె చిత్రపరిశ్రమలోకి ఎంటర్ అయ్యాక ఎవరు ఇష్టమొచ్చినట్టు వాళ్ళు పిలవడం మొదలుపెట్టారు.టాబ్స్, టబ్స్, టబ్బీ, టాబ్లర్, టాబ్లోరోన్ ఇలా రకరకాల పేర్లతో ఆమెని పిలిచేవారు.
ఇంకా ఆమె ఈమెయిల్ కూడా టాబ్లోరోన్ పేరుతో ఉండడం విశేషం.
ఇక టబు గారు 1971 నవంబరు 4న మన హైదరాబాద్‌లో జన్మించారు.
తండ్రి జమాల్ హష్మీ, తల్లి రిజ్వానా.వాళ్ళమ్మ ఓ స్కూల్ టీచర్.
బాల్యంలో ఉండగానే టబు వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని విబేధాల కారణంగా విడిపోయారు.ఇక ప్రముఖ నటులు షబానా అజ్మీ, బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు.
సో, వాళ్ళని చూస్తూ పెరిగిన టబుకి కూడా సినిమాల్లో నటించాలనే ఇష్టం పుట్టింది.దాంతో ఎవరి సహాయం లేకుండా కేవలం సినిమాలపై ఉన్న ఆసక్తితో చిన్నతనంలోనే ముంబయి రైలు ఎక్కేసింది.
అలా అక్కడికి వెళ్లి ట్రై చేయగా ట్రై చేయగా ‘బజార్‘ అనే హిందీ చిత్రంతో బాలనటిగా చిన్న పాత్రలో అవకాశం రావడంతో ఆ పాత్రలో నటించి అందరిని మెప్పించింది టబు.ఆ తర్వాత ‘హమ్ నే జవాన్‘లో కూడా నటించి ఆమె నటన ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక మన తెలుగులో వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘కూలీ నెంబర్ 1’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడంతో ఎంతో సంతోషంగా హైద్రాబాద్ వచ్చి ఈ సినిమాలో ఫుల్ ఎనర్జిటిక్ గా నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది.ఈ సినిమా 1991లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అవ్వడం వెంకీ పక్కన తనదైన శైలిలో నటించి తెలుగు సినిమా నిర్మాతలను కూడా బుట్టలో వేసుకోవడం జరిగింది.ఇక ఆతర్వాత తమిళ్.మలయాళం తెలుగు.హిందీ భాషల్లో ఫుల్ బిజీ అయిపోయింది టబు.ఇక నాగార్జునతో నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడేలో నటించింది.ఇంకా చెన్నకేశవరెడ్డి, అందరివాడు, పాండురంగడు, ‘ఇదీ సంగతి’ తదితర చిత్రాల్లో నటించి అలరించింది.ఆమె తమిళంలో నటించిన ‘కాదల్ దేశమ్’ తెలుగులో ‘ప్రేమదేశం’గా విడుదలై అదికూడా ఘనవిజయం అందుకొంది.
హిందీలో 1994లో అజయ్దేవగణ్ సరసన ‘విజయాపథ్’లో నటించి తొలి విజయాన్ని అందుకుంది.

అలా తన కెరియర్ లో ఫుల్ బిజీ అయిపోయి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు.అలా ఇండియన్ లాంగ్వేజస్ లోనే కాకుండా ఫారెన్ సినిమాల్లో కూడా నటించింది మన టబు.హాలీవుడ్ లో ‘ది నేమ్ సేక్, 2012లో విడుదలైన ‘లైఫ్ ఆఫ్ పై’లోనూ ఓ కీలక పాత్ర పోషించి అలరించింది.హిందీలో చేసిన ‘చీనీకమ్’ కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.
టబు రెండు సార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారం తో పాటు, మాచిస్, చాందిని బార్ సినిమాల్లో నటనకు నేషనల్ అవార్డులు అందుకుంది.
అంతేకాదు ఫిల్మ్ వేర్, ఐఫా పురస్కారాలు గెల్చుకుంది.2011లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో టబును గౌరవించింది.ఇక ప్రస్తుతం టబు వయసు 51 సంవత్సరాలు ఈమె ఇప్పటికి ఎందుకు పెళ్లిచేసుకోలేదో ఎవరికి తెలియదు ప్రెసెంట్ అయితే ఒంటరిగానే తన జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నారు.
ఇక టబు కి ఒక అక్క కూడా ఉన్నారు ఆమె పేరు ఫరా.ఆమె కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.తెలుగులో వెంకటేష్ సరసన ఒంటరి పోరాటం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.బట్ టబుకి వచ్చినంత పాపులారిటీ ఫరాకి రాలేదని చెప్పొచ్చు.