బీజేపీ సమర శంఖం.. నెక్ట్స్ టార్గెట్.. నయా 9 రాష్ట్రాలు..?

భారతీయ జనతా పార్టీ.జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎట్టకేలకు ముగిశాయి.

 Bjp Focus On These 9 States For Coming Lok Sabha Elections Details, Pm Modi, Bjp-TeluguStop.com

అయితే ఈ సందర్భంగా.బీజేపీ నేతలు భారీ టార్గెట్లను నిర్ణయించుకున్నారు.

దేశలో లోక్ సభ ఎన్నికలతో పాటు.దేశంలోని దాదాపు 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి.

దాంతో జాతీయ నేతలంతా వాటిపై ఫోకస్ పెట్టారు.అంతే కాకుండా.

ఈ సారి ఎలాగైనా పార్టీని మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.

లోక్ సభలో గతంలో వచ్చిన సీట్ల కంటే ఈ సారి మరిన్ని పెంచుకోవాలని.

దాని కోసం ఏఏ రాష్ట్రాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుందో అనే విషయాలపై నేతలు చర్చించినట్టు తెలుస్తోంది.ఇక ఉత్తరాదిన అక్కడక్కడా బీజేపీ లోక్ సభ సీట్లు తగ్గే అవకాశం ఉండటంతో.

వాటిని దక్షినాది నుంచి రాబట్టుకోవాలని చూస్తోంది.పంజాబ్, హిమాచల్, ఢిల్లీ, యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో బీజేపీకి ఈ సారి సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.

దాంతో వాటి స్థానంలో.తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో తెచ్చుకోవాలని చూస్తోంది.ఒంటరిగా కుదిరితే ఒంటిరిగా.లేక పోతే పొత్తుల్లో భాగంగా వీటిని సాధించాలని చూస్తోంది.ఇక తెలంగాణాలో పార్టీ బలోపేతం పై కూడా అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.దానికి అనుగుణంగా.

రాష్ట్రంలో మరి కొన్ని పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే చేరికల కమిటీ అంటూ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయిస్తోంది.తెలంగాణతో పాటు.ఈ ఏడాది కర్ణాటకాలోనూ ఎన్నికలు ఉండటంతో.

ప్రత్యేక ఎజెండా రూపొందించినట్టు తెలుస్తోంది.రాబోయే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది.

ఒకవేళ అనుకున్న స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో రాణించలేక పోతే.అది వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube