తిలక ధారణ దేనికి సంకేతం.. చిన్న చుక్క బొట్టుతో ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా..?

నుదుటన కుంకుమ( Kumkuma ) ధరించడం అనేది పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం.భారతీయులలో నుదుటిన తిలకం ధరించడం అనేది ముఖ్యంగా హిందువులలో చాలా ముఖ్యమైన విషయం అని పండితులు చెబుతున్నారు.

 Why Applying Tilak On The Forehead Is Auspicious Details, Tilakam, Kumkuma, Tila-TeluguStop.com

ముఖ్యంగా పండుగలు పర్వదినాలలో తప్పనిసరిగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.హిందువులు తమ ఈ సంప్రదాయాన్ని గుర్తింపుగా భావిస్తారు.

ఇది కేవలం మతాచారం మాత్రమే కాదు.దాని వెనుక కొన్ని ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని శాస్త్రం చెబుతోంది.

హిందుత్వంలో దేహాన్ని దేవాలయంగా భావిస్తారు.శరీరంలోని ప్రతి అవయంలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతారు.ఫాలభాగం బ్రహ్మస్థానం కాబట్టి అక్కడ తిలకధారణ( Tilakadharana ) చేయాలని శాస్త్రం చెబుతోంది.మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపంగా ఫాల భాగంలో ఉంటుందని అంటారు.

ఒక్కట తిలకం ధరించడం వల్ల భక్తి కలిగి నిజాయితీగా జీవితం గడిపేందుకు దోహదం చేస్తుందని ప్రజలు నమ్ముతారు.

Telugu Bhakti, Bottu, Brahmins, Devotional, Hindu, Kshatriyas, Kumkuma, Scientif

ఇదివరకు రోజుల్లో చాతుర్వర్ణాల వారు వారి వారి వృత్తి వర్ణాన్ని అనుసరించి తిలక ధారణ చేసేవారు.వారి తిలకం వారికి ఒక గుర్తింపు.బ్రాహ్మణులు, పౌరోహితం చేసేవారు తెల్లని చెందనాన్ని తీలకంగా నుదుటను ధరించేవారు.

క్షత్రియులు ( Kshatriyas ) వీరత్వానికి గుర్తుగా ఎర్రని కుంకుమ, వైశ్యులు( Vishyas ) సంపదకు చిహ్నంగా పచ్చని కేసరిని, శూద్రులు నల్లని భస్మాన్ని నుదటన తిలకంగా ధరించేవారు.అంతేకాకుండా ఆ విష్ణు భక్తులు చందన తిలకాన్ని నామంగా, శివ భక్తులు భస్మ త్రిపుండ్రాన్ని, దేవి ఉపసాకులు ఎర్రని కుంకుమ బొట్టును తీలకంగా ధరిస్తారు.

Telugu Bhakti, Bottu, Brahmins, Devotional, Hindu, Kshatriyas, Kumkuma, Scientif

ముఖ్యంగా చెప్పాలంటే వేలితో బొట్టు పెట్టుకోవడం శ్రేష్టం.అయితే కొందరు ఉంగరం వేలుతో పెట్టుకోవాలని, మరికొందరు మధ్య వేలుతో పెట్టుకోవాలని విభిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి.ఉంగరం వేలితో పెట్టుకునే బొట్టు వల్ల శాంతి, జ్ఞానం సిద్ధిస్తాయి.మధ్య వేలితో పెట్టుకుంటే ఆయువృద్ధి, సంపదవృద్ధి కలుగుతుంది.కానీ చూపుడు వేలుతో మాత్రం బొట్టు పెట్టుకోకూడదు.నుదుటన బొట్టుగా కుంకుమ, చందనం, సింధూరం ధరించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube