శ్రీవారి భక్తులకు శుభవార్త.. ప్రత్యేక దర్శన టికెట్లు ఈనెల 27 నుంచే..

తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) శ్రీవారి భక్తులకు శుభవార్త తెలిపింది.అయితే వచ్చేనెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుందని తెలిపింది.

 Good News For Tirumula Devotees.. Special Darshan Tickets From 27th Of This Mon-TeluguStop.com

అయితే తిరుమలలో వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.అయితే ఇప్పటికే వచ్చే మూడు నెలలకు గాను సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది.

ఇప్పుడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల పైన కూడా ప్రకటన చేసింది.ప్రత్యేక దర్శనం టికెట్లు రూపాయలు 300 కు గాను ఉంటుంది.

ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో సూచించింది.అంతేకాకుండా జూన్ మాసానికి సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ.

అయితే విడుదల చేసిన కొంత సమయంలోనే టికెట్లు మొత్తం బుక్ అవ్వడం విశేషం.ఇక ఏప్రిల్ మాసానికి సంబంధించి దివ్యాంగుల, వృద్ధుల ఉచిత ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కూడా టీటీడీ ఇవాళా విడుదల చేసింది.

ఇక జూన్ నెలకు సంబంధించి ఆర్జిత బ్రహ్మోత్సవం,కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ, తదితర సేవల టికెట్లను కూడా టీటీడీ నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇక అంతేకాకుండా సనాతన హిందూ ధర్మం, భారతీయ సంస్కృతికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumula ) ప్రచురిస్తున్న పుస్తకాలు నేటి తరం వారికి కూడా సులువుగా అర్థమయ్యేలాగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయినా శ్రీ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి( Buggana Rajendranath Reddy ) సూచించారు.టీటీడీ ప్రచురణల విభాగం కార్యాలయంలో మంత్రి జేఈవో శ్రీమతి సదా భార్గవి తో పాటు మరికొంతమంది ప్రముఖ సాహితీవేత్తలు, పండితులతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది.ఇక వివిధ భాషల్లోనూ టీటీడీ ప్రచురిస్తున్న పురాణాలు, గ్రంథాలు, హిందూ ధర్మ ప్రచారానికి చాలా ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.

ఇక అంతేకాకుండా ఇంతటి గొప్ప పని టీటీడీ మాత్రమే చేయగలుగుతుందని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube