సాధారణంగా మంచి నిద్ర వస్తేనే మనం పగటిపూట ఉల్లాసంగా ఉండగలుగుతాము.కానీ చాలామందికి చెడు కలలు వస్తూ ఉంటాయి.
అలాంటి వారు పడకగదిలో కొన్ని మార్పులు చేస్తే పీడ కలల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.నిద్ర సరిగా లేకపోతే చేసే పని మీద శ్రద్ధ ఉండదు.
దీంతో అనేక ఇబ్బందులు వస్తాయి.ఇక చెడు కలల గురించి స్వప్న శాస్త్రం చాలా విషయాలు చెప్పింది.
ఎలా పడుకుంటే రాకుండా ఉంటాయో కూడా వివరించడం జరిగింది.ఆ పరిష్కారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి నిద్రతోనే మంచి ఆరోగ్యం ఉంటుంది.అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది.

ముఖ్యంగా రోజువారి పనుల్లో చాలా బిజీగా ఉన్న సమయంలో మంచం మీద పడిపోవడం సహజం.అయితే కొంతమందికి నిద్రలో చెడు కలలు( Bad dreams ) వస్తూ ఉంటాయి.దీంతో నిద్రపోవడానికి భయపడేవారు చాలామంది ఉన్నారు.ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇంటి వాస్తు( Vastu )లో కొన్ని మార్పులు చేసుకోవాలి.నిద్రించే దిశ పడకగదిలో మీరు ఉంచే వస్తువులు మీ పీడ కలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.చెడు కలలు రాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించాలి.

కర్పూరం సానుకూలతకు చిహ్నంగా పరిగణిస్తారు.మీరు పడుకునే ముందు కర్పూరాన్ని( Camphor ) మీ మంచం దగ్గర ఉంచుకోవాలి.ఇది పీడ కలలను మీ పైకి రానివ్వదు.అలాగే పడకగదిని తుడవడానికి ముందు నీటిలో చిటికెడు ఉప్పు వేసి ఆపై దానిని గుడ్డతో తుడవాలి.ఇలా చేయడం వలన బెడ్రూంలోని ప్రతికూల అంశాలు తొలగిపోతాయి.రంగు కూడా చెడు కలలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
చెడు కలలతో బాధపడేవారు లేత నీలం రంగు కర్టెన్లు, బెడ్ షీట్లు వాడాలి.చాలా కాలంగా చెడు కలలతో బాధపడుతున్నట్లయితే మంచం దగ్గర రాగీ పాత్రను ఉంచాలి.
చిన్నపిల్లలకు కూడా పీడ కలలు వస్తే మెడలో రాగి కూడిన గొలుసును ధరించాలి.రాగి నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.
నిద్రించే దిశ మీ కలలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.చెడు కలలు వస్తుంటే ఉత్తరం లేదా తూర్పు దిశలో పడుకోవాలి.
ఇది శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.