మనదేశంలో చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎంతో బలంగా నమ్ముతారు.అంతేకాకుండా వారి ఇంటి నిర్మాణాన్ని కూడా వాస్తు ప్రకారమే ఉండేలా చూసుకుంటూ ఉంటారు.
ఎందుకంటే ఇంటి నిర్మాణం ( house Construction ) చేసేటప్పుడు వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖసంతోషాలు ఉంటాయని ప్రజలు నమ్ముతారు.ఎందుకంటే వాస్తుని అనుసరించినప్పుడు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించేందుకు అనుకూలంగా ఉంటుంది.
అందుకే ప్రతి చిన్న చిన్న విషయం గురించి కూడా వాస్తు తెలుసుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో ట్యాప్, సింక్( Tap, sink ) లను ఎక్కడ ఏ దిశలో ఏర్పాటు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి ప్రదేశం కొంత శక్తిని కలిగి ఉంటుంది.ఆ శక్తి మీకు అనుభూతిలోకి రావడం లేదంటే అక్కడ ఖచ్చితంగా వాస్తు దోషం ఉండి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అలా కాకుండా ప్రతిక్షణం ఒక మంచి వైబ్రేషన్ తో ఉండే ప్రదేశాలు కచ్చితంగా వాస్తవం అనుసరించే ఉంటాయన్న సంగతి కూడా చెబుతున్నారు.ప్రతి ఒక్కరు ప్రకృతితో ప్రతిక్షణం అనుసంధానించబడి ఉండాలని సనాతన ధర్మం బోధిస్తూ ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో ట్యాప్, సింక్ ఎక్కడ ఉండాలో కచ్చితంగా అక్కడే ఉండాలి.లేదంటే ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.వాస్తు ప్రకారం దక్షిణ లేదా పడమర దిక్కులో ట్యాప్ ఏర్పాటు చేయకూడదు.ట్యాప్ ఎప్పుడైనా ఉత్తర లేదా తూర్పు దిక్కులో మాత్రమే ఉండాలి.వీటిని ఏర్పాటు చేసే ముందు కచ్చితంగా ఒక సారి చూసుకోవడం ఎంతో మంచిది.లేదంటే ఆర్థిక సమస్యలు వేధిస్తాయి.
వంట గది అత్యంత ముఖ్యమైన ప్రదేశం.ఇక్కడ అన్నపూర్ణ దేవి, అగ్నిదేవుడు కొలవై ఉంటారు.
వంటగదిలో సింగ్ అక్కడ ఏర్పాటు చేసే ట్యాప్ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో మాత్రమే ఉండడం మంచిది.