చనిపోయిన వారి ముక్కులో దూది ఎందుకు పెడతారో తెలుసా..?

సాధారణంగా ఏ మనిషి చనిపోయిన కూడా ముక్కులో, చెవుల్లో పత్తి( Cotton ) పెట్టడం మనం చూస్తూ ఉంటాం.అయితే ఇలా ఎందుకు చేస్తారో ఎప్పుడు అయినా ఎవ్వరు ఆలోచించి ఉండరు.

 Why Cotton Placed Nose Of Dead According To Hindu Culture Details, Cotton ,nose-TeluguStop.com

దీని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూమతంలో మరణించిన వారి కుటుంబ సభ్యులతో దహన సంస్కరాలు( Cremation ) నిర్వహిస్తారు.అయితే అంత్యక్రియలకు ముందు చేయవలసిన, చేయకూడనివి కొన్ని పనులు ఉంటాయి.

అలాగే అంత్యక్రియల తర్వాత కూడా పాటించాల్సినవి చాలా ఉంటాయి.అదే విధంగా మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలను పురాణాలలో ఉన్నాయి.

మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ మృతుడి కుటుంబీకులు కొందరు పూజలు కూడా చేస్తారు.

Telugu Bacteria, Cotton, Ears, Hindu, Hindu Rituals, Nose, Scientific, Soul-Late

అలాగే మరో నియమం కూడా ఉంది.చనిపోయిన వ్యక్తి ముక్కు, చెవులలో పత్తిని పెట్టడం.ఇలా ఎందుకు చేస్తారన్నదానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

దీని వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి.ముందుగా శాస్త్రీయ కారణం ఏంటంటే మరణం తర్వాత ఒక వ్యక్తి చెవులు, ముక్కు నుండి ఒక ప్రత్యేక ద్రవం బయటకు వస్తుంది.

ఈ ద్రవం ప్రవాహాన్ని ఆపడానికి ఇలా పత్తిని పెడతారు.దీంతో పాటు మరణాంతరం శరీరంలోకి ఎలాంటి బాక్టీరియా( Bacteria ) రాకుండా ముక్కు రంధ్రాలు, చెవులను దూదితో కప్పి పెడతారు.

దీని వలన శరీరం త్వరగా పాడైపోకుండా ఉంటుందని చెబుతారు.

Telugu Bacteria, Cotton, Ears, Hindu, Hindu Rituals, Nose, Scientific, Soul-Late

ఇక ఆధ్యాత్మిక కారణం ఏమిటంటే మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని ముక్కు( Nose ) దగ్గరలో చిన్న బంగారం ముక్కలను ఉంచేవారట.ముక్కలు కింద పడకుండా ఉండేందుకు వాటి ముందు పత్తిని ఉంచేవారు.ముక్కులో దూది పెట్టుకోవడానికి ఇది కూడా ఒక కారణమని పెద్ద వాళ్ళు చెబుతారు.

ఇక ముక్కు లేదా చెవులలో దూది పెట్టడం వెనుక మరో కథ కూడా ఉంది.మరణం తర్వాత యమధర్మరాజు ఆత్మను శరీరం నుండి వేరు చేస్తాడు.ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించే మార్గాన్ని కనుగొంటుంది.అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ లోపలికి రాకుండా ఉండటానికి ముక్కు, చెవులలో పత్తిని ఉంచుతారని కూడా చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube