మన దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సమస్యలకు పరిహారలు, పరిష్కారాలు ఉన్నాయి.
వాటిని కచ్చితంగా పాటించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు వంటివి లభిస్తాయి అని చాలామంది నమ్ముతారు.నిరుద్యోగులకి సంబంధించి కూడా జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి.
ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే మంచి ఉద్యోగం లభించి కష్టాలు దూరమయ్యే అవకాశం ఉంది.మరి నిరుద్యోగాన్ని దూరం చేసే పరిష్కారాలలో మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సుందరకాండ పాటించడం మంచిది.
హనుమాన్ చాలీసాను ఏడుసార్లు చదవాలి.ఇలా చేయడం వల్ల నిరుద్యోగం త్వరగా తీరిపోతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే కోరుకున్న ఉద్యోగం పొందడానికి ప్రతి సోమవారం శివుని పూజించడం మంచిది.శివాలయానికి వెళ్లి శివునికి పాలు, అన్నం సమర్పించాలి.
ఇలా శివరాధన చేస్తే నిరుద్యోగ సమస్య దూరం అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే గణేశుడికి నిత్యం పూజిస్తూ లవంగాలు, తమలపాకులు సమర్పించడం వల్ల నిరుద్యోగం దూరం అవుతుంది.
వినాయకుడి దగ్గర పెట్టిన లవంగం, తమలపాకును ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు తీసుకెళ్లడం వల్ల ఉద్యోగం వస్తుంది అని చాలామంది భక్తులు నమ్ముతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయాన్నే స్నానం చేసి ఆ తర్వాత సూర్య భగవంతుని పూజించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది.ఆదివారం ఉప్పులేని ఆహారం తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల కెరియర్లో విజయాలు సాధించే అవకాశం ఉంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఈ రోజున సూర్యోదయానికి ముందే నీళ్లలో పసుపు కలిపి స్నానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.దేవుని ముందు పదకొండు అగరబత్తులను వెలిగించి నీరున్న బావిలో పాలు పోయాలి.
ఈ విషయం ఎవరికీ చెప్పకూడదట.ఈ పరిహారాల ద్వారా నిరుద్యోగం దూరమై ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.