గుడ్లగూబను లక్ష్మీదేవి( Goddess Lakshmi ) వాహనంగా పరిగణిస్తారు.వాస్తు శాస్త్రం ( Vastu Tips )ప్రకారం గుడ్లగూబ ఎంతో పవిత్రమైనదని చెబుతారు.
అందుకే చాలామంది ఇళ్లలో, ఆఫీసులలోనూ గుడ్లగూబ ఫోటోను లేదా విగ్రహాన్ని ఉంచుకుంటూ ఉంటారు.ఇంట్లో, ఆఫీసులలో పాజిటివ్ ఎనర్జీని నిర్ధారించడానికి తప్పకుండా వాసు నియమాలను పాటించాల్సి ఉంటుంది.
అదే విధంగా చాలా మంది కార్యాలయాలు, ఇళ్లలో కూడా గుడ్లగూబ ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టుకుంటూ ఉంటారు.మరి కొంతమంది గుడ్లగూబను అపశకునంగా భావిస్తారు.
మరి వాస్తు దీని గురించి ఏమంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి దేవతకు కూడా తప్పనిసరిగా వాహనం ఉంటుంది.
దేవతలు తమకు నచ్చిన జంతువులను లేదా పక్షిని తమకు వాహనాలుగా ఎంచుకుంటూ ఉంటారని పండితులు ( Scholars )చెబుతున్నారు.
వినాయకుడి వాహనం ఎలుక, దుర్గాదేవి వాహనం సింహం, ఇలా లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అని నిపుణులు చెబుతున్నారు.గుడ్లగూబ పక్షి జాతికి చెందిన జీవి.హిందూ ధర్మంలో గుడ్లగూబ చుట్టూ రకరకాల నమ్మకాలు ఉన్నాయి.
గుడ్లగూబ ఫోటోలు లేదా విగ్రహాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చని చాలామంది ప్రజలు నమ్ముతారు.అయితే నియమాలు పాటించడం తప్పనిసరి అనీ నిపుణులు చెబుతున్నారు.
ఆఫీసు లేదా పని ప్రదేశాలలో గుడ్లగూబ విగ్రహం పెట్టుకోవడం వల్ల విజయాలు మీ సొంతమవుతాయి.ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఒక మార్గం.
అంతే కాకుండా ఆఫీసులో పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఉన్న ఆటంకాలు దూరం అయిపోతాయి.ఆఫీస్ లేదా దుకాణంలోని కౌంటర్లు లేదా ఖాతా పుస్తకాల దగ్గర లేదా మీ కంప్యూటర్ డెస్క్ మీద గుడ్లగూబ ( OWL )విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచుకోవచ్చు.కానీ ఎప్పుడైనా గుడ్లగూబ మీకు కుడి పక్కన ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.దీని వల్ల మీ పనిలో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగిపోతాయి.అంతే కాకుండా ఇంట్లో గుడ్లగూబ చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలని అనుకుంటే లివింగ్ రూమ్, పూజ గది( Pooja room )లో దీన్ని పెట్టుకోవచ్చు.ఇంట్లో గుడ్లగూబ విగ్రహం లేదా చిత్రం ఉండడం ఎంతో మంచిది.
ఇంట్లో గుడ్లగూబ ఉండడం వల్ల చెడు దృష్టి ఇంటి పై పడకుండా ఉంటుంది.
DEVOTIONAL