పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచారు.ఇలా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న చిత్ర బృందం ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇకపోతే పూరి జగన్నాథ్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఒక చిట్ చాట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమా గురించి ఎన్నో విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో మైక్ టైసన్ నటించారు? అతనిని తీసుకోవాలని ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు పూరి జగన్నాథ్ సమాధానం చెబుతూ ఈ సినిమాలో మైక్ టైసన్ లాంటి వ్యక్తి నటిస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది.
ఆలోచన రాగానే ఆయన లాంటి వ్యక్తి ఎందుకు అతనే నటిస్తే సరిపోతుందని అనుకున్నాము.ఇక చార్మి అతనిని ఒప్పించడానికి సుమారు సంవత్సరం పాటు కష్టపడిందని, చివరికి ఆయన ఒప్పుకున్న ఆయన షూటింగ్ లొకేషన్లోకి వచ్చేవరకు మా అందరికీ చాలా టెన్షన్ గానే ఉందని పూరి జగన్నాథ్ తెలిపారు.

ఒక్కసారిగా ఆయన షూటింగ్ లోకేషన్ లోకి అడుగుపెట్టగానే హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నామని ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ తెలిపారు.ఇకపోతే మైక్ టైసన్ ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో తన భార్య మాట్లాడుతూ మా ఆయన ఫైటర్ యాక్టర్ కాదు అని చెప్పారంటూ ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మైక్ టైసన్ గురించి తెలియజేశారు.ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా అనంతరం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో కలిసి తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సినిమా చేస్తున్న విషయం తెలిసింది.







