మళ్లీ రవిప్రకాష్‌ ఎంట్రీ.. టీవీ9లో ఆఫ్‌ ది స్క్రీన్‌ ఏం జరుగుతోంది?

తెలుగు న్యూస్ ఛానళ్లలో సంచలనాత్మక మార్పు గా నిలిచిన టీవీ9 ఈ మధ్యకాలం లో కళ తప్పుతున్నట్లుగా అనిపిస్తుంది.తెలుగులో మొదటి పూర్తి స్థాయి న్యూస్‌ ఛానెల్‌ టీవీ9.

 Ravi Prakash Want To Take Over The Tv9 News Channel Again Raviprakash, Tv9, Tv9-TeluguStop.com

ఆ తర్వాత పదుల సంఖ్యలో తెలుగు న్యూస్ ఛానల్స్ వచ్చినా కూడా టీవీ9ను మాత్రం మించలేకపోయాయి.మించక పోవడం కాదు కదా కనీసం టీవీ9 సాధిస్తున్న టిఆర్పి రేటింగ్ లో 10% కూడా చాలా వరకు చానల్స్ పొందలేకపోయాయి.

అలా టీవీ9 సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది.ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.అయితే ఈ మధ్య కాలంలో టీవీ9 లో జరుగుతున్న పరిణామాల కారణంగా రాబోయే రెండు మూడు నెలల్లో టీవీ9 నెంబర్ వన్ స్థానం చేజారిపోయే అవకాశం ఉంది అనిపిస్తుంది.టీవీ9 ను స్థాపించిన రవిప్రకాష్ ను కొత్త యాజమాన్యం తప్పించడం జరిగింది.ఆయనపై ఆర్థిక నేరాల ఆరోపణలు చేసి ఆయన్ను బయటకు సాగనంపడం జరిగింది.ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఆయన అనునాయులుగా గుర్తింపు ఉన్న కొందరు స్టాఫ్‌ ను కూడా తొలగించారు.

ఇటీవలే సీనియర్‌ జర్నలిస్ట్‌ కమ్‌ విశ్లేషకుడు అయిన రజినీకాంత్ కూడా తొలగించి ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ విషయం పక్కన పెడితే టీవీ9 రేటింగ్ నానాటికి తగ్గుతున్న నేపథ్యంలో మళ్లీ తన ఛానల్ ని తనకు అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించాడు రవి ప్రకాష్.

ఇంకా తనకు అందులో వాటా ఉందని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉందంటూ కోర్టును ఆశ్రయించాడు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రవి ప్రకాష్ కి ఇవ్వడం వల్ల మళ్లీ ఛానల్ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ కొత్త యాజమాన్యం మాత్రం లాభం లేకున్నా పర్లేదు నష్టం వచ్చినా ఇబ్బంది లేదు కానీ టీవీ9 మాత్రం మళ్ళీ రవి ప్రకాష్ కి ఇచ్చేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు.ఈ నేపథ్యంలో టీవీ9 రేటింగ్ మళ్ళీ మళ్ళీ తగుతూనే ఉంది.టీవీ9 మళ్లీ తన చేతికి వస్తుందనే నమ్మకంతో ఇప్పటి వరకు రవి ప్రకాష్ కొత్త ఛానల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube