ప్రభాస్, ప్రశాంత్ నీల్ ల కాంబోలో రూపొందుతున్న సలార్ మూవీ గురించి కేవలం సౌత్ ఆడియన్స్ లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు భారీ యాక్షన్ మూవీని ప్రభాస్ తో రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నాడు.
ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియన్ మూవీలో కాని అసలు ఇండియన్ సినిమాలో కాని చూడని యాక్షన్ సన్నివేశాలను సలార్ లో చూపిస్తాను అంటున్నాడు.హీరోను అత్యంత క్రూరంగా చూపించేందుకు ప్రశాంత్ నీల్ చూస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో కీలక పాత్రను రానా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్తలు పూర్తిగా ఫేక్ అంటూ క్లారిటీ వచ్చేసింది.

రానా సన్నిహితులు స్వయంగా మీడియా వర్గాల వారికి ఈ విషయాన్ని తెలియజేశాడు.ప్రస్తుతం రానా చేస్తున్నది కేవలం విరాటపర్వం మాత్రమే.మరే సినిమాలకు కూడా రానా ఒప్పందం చేసుకోలేదు.ఎవరు కూడా రానాను వచ్చి అడిగింది లేదు అన్నారు.
పవన్ తో సినిమా విషయంలో కూడా రానా పేరు ప్రస్థావనకు వచ్చింది.ఆ విషయంలో క్లారిటీ ఇవ్వకున్నా కూడా సలార్ విషయంలో మాత్రం పూర్తి స్పష్టత ఇచ్చారు.
రానా సలార్ లో లేడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.బాహుబలి సినిమాలో వీరిద్దరు కలిసి నటించడం వల్ల సినిమా రేంజ్ ఏ స్థాయికి వెళ్లిందో తెల్సిందే.ఇప్పటికి ఇండియాలో నెం.1 సినిమా బాహుబలి అంటూ ఉంటారు.అంతటి క్రేజీ కాంబో సలార్ లో రిపీట్ అయితే ఏమైనా ఉందా.అంచనాలు ఆకాశాన్ని తాకినట్లే కదా.కాని ఆ అంచనాలు ఒక్కసారిగా నేలన పడ్డట్లుగా రానా నటించడం లేదు అంటూ తెలియడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.







