అదృష్టం అనేది చెప్పి రాదు, అది ఎప్పుడు ఎలా వరిస్తుందో కూడా చెప్పలేము, తాజాగా ఓ అమెరికన్ ను అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టుగా వరించింది.అది కూడా ఒక సారి కాదు 160 సార్లు.
ఏంటి అర్ధం కాలేదా.ఓ అమెరికన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలను అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ఓ 160 లాటరీ టిక్కెట్లు కొనుగులు చేశాడు.ఎదో ఒకటి తగలక పోదులే కొనేస్తే పోలా అనుకున్నాడు, కానీ నిర్వాహకుల మైండ్ బ్లాక్ అయ్యేలా అతగాడికి 160 లాటరీ టిక్కెట్ల లాటరీలో తగిలాయి.
అమెరికాలోని వర్జీనియా కు చెందిన క్వామే క్రాప్ అనే వ్యక్తికీ లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడం అలవాటుగా మారింది.ఎప్పటికప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలను అనుకునే కాన్వే.
ఒకే సారి 160 టిక్కెట్లు కొనుగోలు చేశాడు.వీటిలో ఏ ఒక్కటి తనకు తగిలినా ఎదో ఒక చిన్న షాపు పెట్టుకుని బ్రతుకు బండి నేట్టేయచ్చు కదా అనుకున్నాడు.
కానీ ఊహించని విధంగా అతడికి అదృష్టం కలిసి వచ్చింది.సదరు లాటరీ వాళ్ళు తీసిన డ్రాలో కాన్వే కొన్న అన్ని టిక్కెట్లకు లాటరీ తగిలింది…

మొదట్లో ఈ విషయాన్ని కాన్వే నమ్మలేక పోయాడట.అసలు ఇది నిజమేనా అనుకుని ఒకటికి రెండు సార్లు పరీక్షించి టిక్కెట్లు చూసుకున్నాడట.చివరికి 160 టిక్కెట్లు డ్రాలో గెలుపొందటంతో అతడి ఆనందానికి అవధులు లేవు.
ఇంతకీ ఆ లాటరీ మొత్తం సొమ్ము ఎంతో తెలుసా.అక్షరాలా రూ.6 కోట్లు.చిన్నపాటి ఫుడ్ కోర్డ్ పెట్టుకోవాలని అనుకున్న అతడు ఏకంగా పెద్ద హోటల్ పెట్టేస్తాయికి వెళ్ళిపోయాడు.
అయితే తనకు వచ్చిన డబ్బును దూబరా చేయకుండా, మంచి పనులకు, అలాగే తన కుటుంభ అభివృద్దికి వెచ్చిస్తానని తనకు డబ్బు విలువ తెలుసనీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.