ఈ నూనె మీ ఇంట్లో ఉంటే దోమ‌లు ద‌రి దాపుల్లోకి కూడా రావు..తెలుసా?

ప్ర‌స్తుత చ‌లి కాలంలో ఎవ‌రింట్లో చూసినా దోమ‌లు విప‌రీతంగా క‌నిపిస్తుంటాయి.ఇవి చూడ‌టానికి చిన్న‌గా ఉన్నా.

 Wonderful Benefits Of Neem Oil! Benefits Of Neem Oil, Neem Oil, Latest News, Nee-TeluguStop.com

నిలువెత్తు మ‌నిషిని నిండా ముంచేస్తాయి.డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధులు దోమ‌ల వ‌ల్లే వ‌స్తుంటాయి.

అందుకే దోమ‌లను ఇంట్లో నుంచి త‌రిమి కొట్టేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ముఖ్యంగా మస్కిటో కాయిల్స్, స్ప్రేస్ వంటివి వాడుతుంటారు.

అయితే ఇటువంటివి దోమ‌ల‌కే కాదు మ‌న‌కీ హాని చేస్తాయి.

అందుకే స‌హ‌జ ప‌ద్ధ‌తుల్లోనే దోమ‌ల‌ను వెల్ల‌గొట్టేందుకు ప్ర‌త్నించాలి.

అందుకు వేప నూనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.వేప నూనె ఇంట్లో ఉంటే దోమ‌లు ద‌రి దాపుల్లోకి కూడా రావు.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో మూడు టేబుల్ స్పూన్ల వేప నూనెను వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ వాట‌ర్‌ను ఒక స్ప్రే బాటిల్‌లో నింపి.

ఇంట్లో స్ప్రే చేసుకోవాలి.దాంతో వేప నూనె వాస‌న‌కు దోమ‌లు రాకుండా ఉంటాయి.

ఇంట్లోనే ఏమైనా దోమ‌లు ఉన్నా బ‌య‌ట‌కు ప‌రార్ అవుతాయి.

అలాగే వేప నూనెతో మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.శ‌రీరంపై ఏమైన పురుగులు, కీటకాలు కొట్టి నొప్పి పుడుతుంటే.ఆ ప్రాంతంలో వేప నూనెను అప్లై చేయాలి.

దాంతో అందులో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాలు నొప్పితో పాటు మంట‌, దుర‌ద వంటి స‌మ‌స్య‌ల‌నూ నివారిస్తాయి.

ఇక దంతాలు, చిగుళ్ల నొప్పులతో బాధ ప‌డే వారికి వేప నూనె బెస్ట్ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.

ఒక క‌ప్పులో గోరు వెచ్చ‌ని నీటిని తీసుకుని..

అందులో ఒక స్పూన్ వేప నూనె వేసి క‌ల‌పాలి.ఇప్పుడు ఈ నూనెను నోట్లో పోసుకుని కాసేపు పుక్క‌లించి ఊయాలి.

ఇలా రోజూ ఉద‌యం, సాయంత్రం చేస్తే దంతాలు, చిగుళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube