వింటర్ లో పొడి జుట్టును రిపేర్ చేసే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ ఇది!

వింటర్ సీజన్ లో చాలా మంది ఎదుర్కొనే సమస్య డ్రై హెయిర్( Dry hair ).వాతావరణం లో వచ్చే మార్పులకు తోడు రెగ్యులర్ గా తల స్నానం చేయడం, వేడి వేడి నీటిని హెయిర్ వాష్ కు ఉపయోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వాడటం తదితర కారణాల వల్ల జుట్టు పొడి పొడిగా మారిపోతుంటుంది.

 This Is A Super Effective Remedy To Repair Dry Hair In Winter! Dry Hair, Winter,-TeluguStop.com

అయితే పొడి జుట్టును రిపేర్ చేయడానికి ఒక సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ ఉంది.మరి లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో ఒక చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆపై ఒక చిన్న కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( aloe vera gel ), మూడు టేబుల్ స్పూన్లు బియ్యం నానబెట్టుకున్న వాటర్ వేసుకోవాలి.వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె( Mustard oil ) లేదా ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి మసాజ్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Healthy, Remedy, Smooth, Effectiveremedy-Telugu Health

గంట పాటు షవర్ క్యాప్ ధరించి అనంతరం మైల్డ్ షాంపూతో శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి రెండుసార్లు ఈ విధంగా చేశారంటే చలికాలంలో పొడి జుట్టు అన్న మాటే అనరు.అలోవెరా, ఆవనూనె, తేనె, రైస్ వాటర్.

ఇవన్నీ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.పొడి జుట్టును తేమగా మృదువుగా మారుస్తాయి.

షైనీగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.

Telugu Care, Care Tips, Healthy, Remedy, Smooth, Effectiveremedy-Telugu Health

పైగా ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల జుట్టు రాలడం, విరగడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.హెయిర్ గ్రోత్ అనేది అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.కురులు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతాయి.

కాబట్టి వింటర్ సీజన్ లో పొడి జుట్టుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube