ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సీజన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుందనే సంగతి తెలిసిందే.సినీ అభిమానులు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన అన్ని సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తారు.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతి వస్తున్నాం( Game Changer, Daku Maharaj, Sankrantiki vastunnam ) సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి.ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని మంచి లాభాలను సొంతం చేసుకోవాలని సినీ అభిమానులు భావిస్తారు.గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతి వస్తున్నాం ఆంధ్ర ఏరియా బిజినెస్ లెక్కలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ మూవీ ఆంధ్ర హక్కులు 65 కోట్ల రూపాయలకు( Andhra rights for Rs 65 crore ) అమ్ముడవగా డాకు మహారాజ్ ఆంధ్ర హక్కులు 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.
సంక్రాంతికి వస్తున్నాం ఆంధ్ర హక్కులు మాత్రం 15 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు తెలుస్తోంది.వైజాగ్ ఏరియాలో దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నారని ఆ రీజన్ వల్లే ఈ సినిమా హక్కులు తక్కువ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది.ఆంధ్ర ఏరియా నుంచి ఈ సినిమాలకు 130 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
సీడెడ్ మినహాయించి ఈ సినిమాలకు ఈ స్థాయిలో బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.ఆంధ్రలో అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ చేసిన సంక్రాంతి సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో అదరగొడతాయో చూడాల్సి ఉంది.సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి సినిమాలతోనే కళ వస్తుందనే సంగతి తెలిసిందే.
సంక్రాంతి సినిమాలన్నీ అంచనాలకు మించి విజయం సాధిస్తే ఫ్యాన్స్ ఆనందానికి కూడా అవధులు ఉండవు.