వింటర్ లో పొడి జుట్టును రిపేర్ చేసే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ ఇది!

వింటర్ సీజన్ లో చాలా మంది ఎదుర్కొనే సమస్య డ్రై హెయిర్( Dry Hair ).

వాతావరణం లో వచ్చే మార్పులకు తోడు రెగ్యులర్ గా తల స్నానం చేయడం, వేడి వేడి నీటిని హెయిర్ వాష్ కు ఉపయోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వాడటం తదితర కారణాల వల్ల జుట్టు పొడి పొడిగా మారిపోతుంటుంది.

అయితే పొడి జుట్టును రిపేర్ చేయడానికి ఒక సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ ఉంది.

మరి లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో ఒక చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.

ఆపై ఒక చిన్న కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), మూడు టేబుల్ స్పూన్లు బియ్యం నానబెట్టుకున్న వాటర్ వేసుకోవాలి.

వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) మరియు వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె( Mustard Oil ) లేదా ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి మసాజ్ చేసుకోవాలి.

"""/" / గంట పాటు షవర్ క్యాప్ ధరించి అనంతరం మైల్డ్ షాంపూతో శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండుసార్లు ఈ విధంగా చేశారంటే చలికాలంలో పొడి జుట్టు అన్న మాటే అనరు.

అలోవెరా, ఆవనూనె, తేనె, రైస్ వాటర్.ఇవన్నీ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.

పొడి జుట్టును తేమగా మృదువుగా మారుస్తాయి.షైనీగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.

"""/" / పైగా ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల జుట్టు రాలడం, విరగడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

హెయిర్ గ్రోత్ అనేది అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.కురులు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతాయి.

కాబట్టి వింటర్ సీజన్ లో పొడి జుట్టుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

రాత్రి 11 అయినా భోజనం లేదు.. భారతీయ విందులపై అమెరికన్ షాకింగ్ కామెంట్స్!