టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసింది.పూరి జగన్నాథ్ అలాగే విజయ్ దేవరకొండ కెరియర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా గానీ నిలిచింది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ ను సాధించకపోగా నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.ఇక ఈ సినిమా విడుదల అయిన తర్వాత విజయ్ దేవరకొండపై అలాగే పూరి జగన్నాథ పై భారీగా విమర్శలను గుప్పించారు నెటిజన్స్.
ఇది ఇలా ఉంటే తాజాగా లైగర్ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదేమిటంటే.
లైగర్ సినిమా లావాదేవీల పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్ చేసింది.ఈ సినిమాలో ఎవరెవరు ఎంత పెట్టుబడులు పెట్టారు అనే విషయం పై లైగర్ నిర్మాతలు పూరీ జగన్నాథ్, చార్మీలను విచారిస్తోంది ఈడీ.ఈ నేపథ్యంలోనే తాజాగా పూరీ జగన్నాథ్,చార్మీ లు ఈడీ ఆఫీస్ దగ్గరికి చేరుకున్నారు.ఇక లైగర్ సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ వారిపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.
కాగా వీరు ఫెమా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు.

అయితే ఈ లైగర్ సినిమాలో రాజకీయ నేతలు బ్లాక్‌మనీని పెట్టుబడులుగా పెట్టారంటూ ఆరోపణలు వినిపించడంతో పాటు ఇదే విషయం పై ఈడీకి ఫిర్యాదు కూడా అందింది.దీనికి తోడు లైగర్ నిర్మాతలు ఫెమా నిబంధనలను బ్రేక్ చేసినట్లు ఆధారాలు దొరకడంతో విచారణను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పూరీ, చార్మీలకు పదిహేను రోజుల క్రితమే నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడిన పూరీ, చార్మీ లు తాజాగా కలిసి నేడు ఈడీ ఆఫీస్‌కు వెళ్లగా విదేశీ పెట్టుబడుల గురించి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.







