Mahesh babu krishna : నువ్వు ఒంటరి కాదన్నా మేమున్నాం.. మహేష్ బాబుకు దైర్యం చెబుతున్న అభిమానులు!?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మహేష్ బాబు.టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు,అభిమానులు మహేష్ బాబు పట్ల సంతాపం తెలుపుతున్నారు.

 2022 Year Emotional Setbacks And Personal Losses Mahesh Babu Mahesh Babu, Tollyw-TeluguStop.com

మహేష్ బాబుకు 2022 అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు.ఎందుకంటే ఒకే ఏడాది మహేష్ బాబు ఏకంగా ముగ్గురిని కోల్పోయాడు.

మొదట తన అన్నని కోల్పోయిన మహేష్ బాబు ఆ తర్వాత కొద్ది నెలలకి తల్లిని కోల్పోయాడు.అయితే తల్లి చనిపోయిన వార్త నుంచి ఇంకా పూర్తిగా బయటపడక ముందే అప్పుడే తండ్రి మరణించడంతో మహేష్ బాబు మరింత కుంగిపోయాడు.

ఇలా ఒకే ఏడాది ముగ్గురు మరణించడంతో మహేష్ బాబు ఆ బాధలో నుంచి బయటం పడడం కష్టంగా మారింది.

ఒకరి మరణం నుంచి కోలుకునే లోపు మరొకరు మరణిస్తూ మహేష్ కి దుఃఖాన్ని మిగులుస్తున్నారు.

ఇలా వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో పాటు మహేష్ బాబు ఒంటరిగా అయిపోయాడు.అయితే బాధాతప్త హృదయంతో దిగాలుపడ్డ మహేష్‌కి మేమున్నామంటూ ఆయన అభిమానులు ముందుకొస్తున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్స్‌ చేస్తున్నారు.నువ్వు ఒంటరి కాదు.మేమంతా నీకు తోడుగా ఉన్నామని ధైర్యాన్ని ఇస్తున్నారు.సాధారణంగా మనం ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ బాధ నుంచి కోల్పోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.అలాంటిది ఏకంగా మహేష్ బాబు ఇంట్లో ముగ్గురు చనిపోవడం అన్నది నిజంగా బాధాకరం మహేష్ బాబు భాధ అన్నది వర్ణనా తీతం అని చెప్పవచ్చు.

ఈ ఏడాది మొదట్లో తన అన్నయ్య చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయాడు మహేష్ బాబు.అయితే మహేష్ బాబు బాధను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకోవడం, అలాగే మహేష్ బాబు ను ఓదార్చినప్పటికీ ఆయన కళ్ళల్లో బాధ మొత్తం కనిపిస్తోంది.మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణం మహేష్ ని చాలా వరకు కృంగదీసింది.

ఇటువంటి కష్టకాలంలో అందరూ మహేష్‌కు సంతాపం తెలుపుతున్నారు.సోషల్‌ మీడియాలో మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు.

#StayStrongMaheshAnna అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.ఈ బాధ నుంచి మహేష్‌బాబు త్వరగా బయటపడాలని పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు కోరుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube