సినిమా ఇండస్ట్రీలోకి ఒకటి అవుదామని వచ్చి మరొకటి అయిన వారు చాలా మంది ఉన్నారు.అసిస్టెంట్ డైరెక్టర్లుగా మొదలుపెట్టి హీరోలు అయిన వారు ఉన్నారు.
హీరోలతో డ్యాన్సులు చేయించిన కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లూ అయ్యారు.డాన్సు నుంచి దర్శకత్వం వైపు వచ్చిన వారిలో కొందరు సక్సెస్ కాగా మరికొంత మంది వచ్చిన దారికే వెళ్లిపోయారు.ఇంతకీ డైరెక్టర్లుగా మారిన కొరియోగ్రాఫర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్ని ప్రకాశ్
తెలుగుతో పాటు కన్నడ, హిందీ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు.అనంతరం 1997లో గూంగట్ అనే హిందీ సినిమాకు దర్శకత్వం వహించాడు.ఈ సినిమా పెద్దగా ఆడలేదు.డాన్స్ మాస్టర్ గా జాతీయ అవార్డు అందుకున్న ప్రకాశ్ పలు అద్భుత సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు.
తరుణ్ మాస్టర్
ఢీషో జడ్జిగా ప్రజలకు పరిచయం అయిన తరుణ్ మాస్టర్ చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేశాడు.2003లో ఓ తమిళ సినిమాను నయూ పడోస్ పేరుతో హిందీలోకి రీమేక్ చేశాడు.ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.
ఫరాఖాన్
80లో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరుపొందింది ఫరాఖాన్.ఎన్నో అద్బుత సినిమాలకు తన స్టెప్పులతో స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచింది.2004లో తను దర్శకత్వం వహించిన సినిమా మైహూనా మంచి విజయం సాధించింది.
ప్రభుదేవా
ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవా సౌత్ సత్తా ప్రపంచానికి చాటాడు.2009లో పోకిరి సినిమాను హిందీలోకి సల్మాన్ హీరోగా వాంటెడ్ పేరుతో రీమేక్ చేశాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అమ్మ రాజశేఖర్
కొరియోగ్రాఫర్ గా పలు సినిమాలకు పనిచేసిన రాజశేఖర్. రణం సినిమాకు దర్శకత్వం వహించాడు.ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.
రాఘవ లారెన్స్
ప్రభుదేవా తర్వాత ఆ రేంజిలో డాన్స్ చేసేది లారెన్స్ మాత్రమే.2004లో నాగార్జున హీరోగా మాస్ సినిమా తీసి సూపర్ సక్సెస్ అయ్యాడు.ఆ తర్వాత సుమారు 9 సినిమాలను తెరకెక్కించాడు.
దర్శకుడిగా మంచి పేరు పొందాడు.