ముఖం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్న కూడా అక్కడక్కడ కనిపించే నల్లటి మచ్చలు( Dark Spots ) అందం మొత్తాన్ని పాడుచేస్తాయి.ముఖంపై ప్రధానంగా మొటిమల వల్ల మచ్చలు పడుతుంటాయి.
కొందరికి మొటిమలు తగ్గిన.వాటి తాలూకు మచ్చలు మాత్రం అలానే ఉండిపోతాయి.
అయితే అటువంటి మచ్చలను పోగొట్టి అందరమైన మెరిసే చర్మాన్ని అందించే పవర్ ఫుల్ ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెమెడీ 1:
ఆరెంజ్ తొక్కలను ఎండలో బాగా ఎండబెట్టి మెత్తని పౌడర్ చేసుకోవాలి.వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ తొక్కల పొడిలో( Orange Peel Powder ) పాలు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.
పూర్తిగా ఆరిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
రెమెడీ 2:
ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా,( Aloevera ) రెండు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్,( Potato Juice ) వన్ టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ రెమెడీని పాటించిన కూడా చర్మంపై మొండి మచ్చలు తగ్గుముఖం పడతాయి.
రెమెడీ 3:
లెమన్ అండ్ హనీ కాంబినేషన్ కూడా మొండి మచ్చలను వదిలించడంలో సహాయపడుతుంది.వన్ టేబుల్ స్పూన్ తేనెలో వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి మచ్చలపై అప్లై చేసుకోవాలి.20 నిమిషాల తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసిన కూడా మచ్చలు పోయి ముఖం అందంగా కనిపిస్తుంది.
రెమెడీ 4:
స్ట్రాబెర్రీ పండ్లు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందాన్ని పెంచడంలో కూడా తోడ్పడతాయి.స్ట్రాబెర్రీ లో ఉండే విటమిన్ సి నల్లటి మచ్చలకు వ్యతిరేకంగా పోరాడతాయి.స్ట్రాబెరీ పండ్లను మెత్తగా పేస్ట్ చేసి అందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.15 నిమిషాల అనంతరం ముఖాన్ని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే చర్మంపై మచ్చలు మొటిమలు పోయి కాంతివంతంగా మారుతుంది.