పలు సంవత్సరాల కోసం సరఫరా ఒప్పందం చేసుకున్న క్యూబిక్‌ పీవీ మరియు వారీ

ముంబై, ఏప్రిల్‌ 29,2022 : క్యూబిక్‌ పీవీ (CubicPV) మరియు భారతదేశపు అతి పెద్ద సోలార్‌ మాడ్యుల్‌ తయారీదారు వారీ ఎనర్జీస్‌ లిమిటెడ్‌ (Waaree Energies Ltd)నేడు తాము బహుళ సంవత్సరాల సరఫరా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాయి.దీనిలో భాగంగా క్యూబిక్‌ పీవీ సంవత్సరానికి ఒక గిగావాట్‌ సిలికాన్‌ సెల్స్‌ను వారీకి సరఫరా చేయనుంది.

 Cubicpv And Waaree Announce Multi-year Supply Agreement, Cubicpv , Waaree, Tran-TeluguStop.com

ఈ సెల్స్‌లో వాఫర్స్‌ ఉంటాయి.ఇవి క్యూబిక్‌ పీవీ యొక్క ట్రాన్స్‌ఫర్మేటివ్‌ డైరెక్ట్‌ వాఫర్‌ టెక్నాలజీ కలిగి ఉంటాయి.

ఈ టెక్నాలజీతో ఒకే అడుగులో నేరుగా సిలికాన్‌ నుంచి వాఫర్స్‌ను తయారుచేస్తారు.ఈ ఒప్పందంతో వారీ వ్యూహాత్మకంగా విస్తృతస్థాయిలో పరిశ్రమ వృద్ధిని ఒడిసిపట్టడంతో పాటుగా లోయెస్ట్‌ లెవలైజ్డ్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ (ఎల్‌సీఓఈ)ను భారతదేశపు యుటిలిటీ స్కేల్‌ మార్కెట్‌కు అందిస్తుంది.

‘‘భారతదేశపు దేశీయ యుటిలిటీ మార్కెట్‌కు మా డైరెక్ట్‌ వాఫర్‌ టెక్నాలజీ అత్యుత్తమ పరిష్కార ం మరియు జెనరిక్‌ పద్ధతుల కంటే మెరుగైన సాంకేతికతలను ఎంచుకోవడం ద్వారా వారీ భారతీయ తయారీ రంగపు భవిష్యత్‌కు తగిన శక్తిని, అత్యుత్తమంగా మెటీరియల్స్‌, శక్తిని వినియోగించడంతో పాటుగా అత్యున్నత సామర్థ్యం చేత నిర్వచించబడుతుంది’’ అని ఫ్రాంక్‌ వాన్‌ మియర్లో, సీఈవో, క్యూబిక్‌ పీవీ అన్నారు.ఆయనే మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో మా ప్రయాణం ప్రారంభించడం పట్ల క్యూబిక్‌ పీవీ సంతోషంగానూ, వారీతో భాగస్వామ్యంను గౌరవంగానూ భావిస్తుంది.

భారతదేశంలో అగ్రగామి మాడ్యుల్‌ తయారీదారుల నడుమ సారుప్యత మరియు క్యూబిక్‌ యొక్క ఇన్నోవేషన్‌ ఎజెండా ఈ రెండు కంపెనీలకూ, భారతదేశంలో సోలార్‌ పరిశ్రమకు విలువను సృష్టించనుంది’’అని అన్నారు.

ఈ రెండు కంపెనీల నడుమ భాగస్వామ్యం , భారతీయ దేశీయ సోలార్‌ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా చేసుకుంది.

వారీ కోసం, దేశీయ సరఫరా లైన్‌ కోసం క్యూబిక్‌ పీవీ తగిన ఏర్పాట్లు చేయడంతో పాటుగా లాజిస్టిక్స్‌ సవాళ్లకు , ఒడిదుడుకులతో కూడిన నిత్యావసర ధరలకు తగిన పరిష్కారాలను సైతం అందించనుంది.‘‘సోలార్‌ పరిశ్రమలో ప్రవేశించిన తొలి తరపు కంపెనీగా ఆవిష్కరణల విలువను, మా నాయకత్వ స్థానం పరంగా వారీ గుర్తించబడింది.

క్యూబిక్‌ పీవీ యొక్క సాంకేతికతలు మా వినియోగదారులకు అసాధారణ ప్రయోజనం అందించడంతో పాటుగా భారతీయ సోలార్‌ మార్కెట్‌కు తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రయోజనం అందిస్తాయి.అతి తక్కువ కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌తో దేశీయంగా ఉత్పత్తి చేయబడిన వాఫర్స్‌ మరియు సెల్స్‌ ను మార్కెట్‌కు తీసుకురావడం పట్ల మేము గర్వంగా ఉన్నాము’’ అని వారీ ఛైర్మన్‌ – మేనేజింగ్‌ డైరెక్టర్‌ హితేష్‌ దోషీ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube