చెర్రీ తెల్ల కాగితం లాంటివాడు.. ఎన్టీఆర్ గురించి అంతా తెలుసు: రాజమౌళి

టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Rajamouli Praises Ram Charan And Jr Ntr Acting In Rrr Movie Ram Charan, Jr Ntr,-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు, టీజర్ లకు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా జనవరి 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కబోతుండడంతో చెర్రీ అభిమానులు, తారక్ అభిమానులు మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే భాగంగా గత కొద్ది రోజులుగా ముంబై లోనే ఉంటున్నారు.ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి హీరోల గురించి, హీరోలు సెట్ లో ఎవరు ఎక్కువగా ఆశ్చర్యపరిచారో ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

నాకు ఎన్టీఆర్ గురించి బాగా తెలుసు.ఎప్పుడు ఎలా ఉంటాడు ఏం చేస్తుంటాడు.

ఏవిధంగా ఆలోచిస్తాడు.ఒక కథ చెప్పినప్పుడు దాని గురించి ఏమి ఆలోచిస్తాడు.

ఇలా ప్రతి ఒక్కటి కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి నాకు బాగా తెలుసు.కానీ రామ్ చరణ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు.

రామ్ చరణ్ నన్ను చాలా ఆశ్చర్య పరిచేవాడు.షూటింగ్ సెట్ కి రామ్ చరణ్ ఖాళీ మైండ్ తో వచ్చే వాడు.

Telugu Jr Ntr, Rajamouli, Ram Charan, Tollywood-Movie

మైండ్ లో ఎటువంటి ఒత్తిడి పెట్టుకోకుండా.ఒక వైట్ పేపర్ లా వస్తాడు.ఒక వైట్ పేపర్, పెన్ ఇచ్చినట్టు వస్తాడు.అందులో ఏం కావాలో ఇక రాసుకో అన్నట్టు వదిలేస్తాడు.ఇలా ఎన్నో సార్లు రామ్ చరణ్ నన్ను ఆశ్చర్యపరిచాడు.ఇక సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కూడా ఎవరి స్టైల్ లో వారు నటించారని చెప్పుకొచ్చాడు రాజమౌళి.

చాలా సందర్భాల్లో ఇద్దరు నేను కూడా ఊహించని దానికంటే గొప్పగా చేశారు.అది చూసి నేను చాలా సందర్భాలలో ఆశ్చర్యపోయాను.

ఇక షూటింగ్ సెట్ లో అయితే ఇద్దరూ తెగ అల్లరి చేసేవారు.ఆలియా భట్ మాత్రం క్రమశిక్షణతో ఉండేది అంటూ రాజమౌళి హీరోల గురించి చిత్ర బృందం గురించి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube