టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సంపద విలువ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Ss Rajamouli Net Worth Car Collection Lifestyle And Movie Earnings, Ss Rajamouli-TeluguStop.com

ఈయనకు టాలీవుడ్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు రాజమౌళి.

ఆయన ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నాయి.అంతేకాకుండా ఒకదానిని మించి ఒకటి ట్రెండ్ ని సెట్ చేశాయి.

ఆయన కలెక్షన్లను ఆయన రికార్డులను ఆయనే బద్దలు కొట్టారు.

Telugu Assets, Baahubali, Lifestyle, Mahesh Babu, Ss Rajamouli, Tollywood-Movie

ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు( Mahesh Babu ) తో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇక ఆ సంగతి అటు ఉంచితే నేడు అనగా అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు కావడంతో ఆయనకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలోనే ఆయన సంపాదనకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.

ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమాను కూడా చూడలేదు అంటే రాజమౌళి ఏ రేంజ్ లో సంపాదించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.ఇకపోతే జక్కన్న సంపాదన విషయానికి వస్తే.రాజమౌళి సంపాదన మొత్తంగా దాదాపు రూ.158 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.సినిమాలతో పాటు పలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు రాజమౌళి.

Telugu Assets, Baahubali, Lifestyle, Mahesh Babu, Ss Rajamouli, Tollywood-Movie

2008 సమయంలో రాజమౌళి పంజాగుట్టలో ఒక విల్లాను కొనుగోలు చేశారట.ప్రస్తుతం ఆయనకు కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే రాజమౌళి వద్ద రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ వంటి కార్లు కూడా ఉన్నాయట.

వాటి ధర కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు ఉంటుందని తెలుస్తోంది.ఇకపోతే ఆయన రెమ్యూనరేషన్ ( Remuneration )విషయానికి వస్తే బాహుబలి సినిమా( Baahubali )కు 25 కోట్లు తీసుకున్న ఆయన త్రిబుల్ ఆర్ సినిమాకు 100 కోట్లు అందుకున్నారని సమాచారం.

అయితే తన తదుపరి సినిమాకు మరింత ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తోంది.కేవలం ఇవి మాత్రమే కాకుండా ఆయన వద్ద ఇంకా కోట్లు విలువ చేసే చాలా రకాల వస్తువులు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఎంత కోటీశ్వరుడు అయినప్పటికీ రాజమౌళి మాత్రం ఎల్లప్పుడూ సింపుల్ గానే కనిపిస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube