సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న క్రమంలో, ఆమె నటించిన సినిమాలు విడుదల అయితే ఏకంగా ఆమె స్టార్ గా కూడా మారిపోయేది ఇలాంటి నేపథ్యంలోనే ఆ నటి ఆత్మహత్య చేసుకుంది.
కొందరు మోసగాళ్లు ఎన్సీబీ అధికారులు అని చెప్పి ఆమె నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు.ఆ నటి డ్రగ్స్ కేసు భయంతో ఆత్మహత్య చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.బాలీవుడ్ లో ఒక హీరోయిన్ నటిగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది.
డిసెంబర్ 20న ఒకరోజు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో పార్టీకి వెళ్ళింది.అది రేవ్ పార్టీ అనే సాకుతో నకిలీ ఎన్సీబీ అధికారులు అక్కడ రైడ్ నిర్వహించారు.
అయితే డ్రగ్స్ కేసులో ఆ నటి పేరు బయట చెప్పకుండా ఉండాలి అంటే 40 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.అప్పుడు ఆ నటి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అతి కష్టం మీద 20 లక్షలు వారికి ఇచ్చింది.
అయినప్పటికీ ఆ నకిలీ ఎన్సీబీ అధికారులు ఆమెను డబ్బు కోసం వేధించారు.అక్కడ జరిగిన పరిణామాలతో తీవ్ర కలత చెందిన ఆ నటి మనస్థాపంతో తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయింది.
పోలీసులు ఆమెను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
అయితే కేసు దర్యాప్తులో వారికి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.పార్టీలో బెదిరించి డబ్బులు పొందిన ఆ నకిలీ వ్యక్తులను అరెస్టు చేశారు.ఆమె మరణానికి కారణమైన సూరజ్ మోహన్ పరదేశి, పర్వీన్ రఘునాథ్ వాలింబేలను పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఆ నటిని పార్టీకి తీసుకెళ్ళిన స్నేహితుల్లో ఒకడి ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగింది.
ఇదే విషయంపై మంత్రి నవాబు మాలిక స్పందిస్తూ.ఎన్సీబీ లోని కొందరు నకిలీ అధికారులు ప్రైవేట్ సైన్యాలను ఏర్పాటు చేసుకుని బాలీవుడ్ ప్రముఖులు ఆర్టిస్టులను ఫేక్ కేసులతో బెదిరిస్తున్నారు అంటూ ఆరోపించాడు.బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కేసు విషయంలో ప్రైవేట్ ఎన్సీబీ సైన్యాల లింకులు బెదిరింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.