ఖాళీ క‌డుపుతో ఈ వాట‌ర్‌ను తీసుకుంటే నెల రోజుల్లో నాజుగ్గా మార‌తారు!

ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం నానా పాట్లు పడుతుంటారు.

 Drinking This Water On An Empty Stomach Will Help You Lose Weight!, Lose Weight,-TeluguStop.com

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే వాటర్ ను ఖాళీ కడుపుతో తీసుకుంటే నెల రోజుల్లో నాజూగ్గా మారతారు.మరి ఇంతకీ ఆ వాటర్ ఏంటి.? అస‌లు ఆ వాట‌ర్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు వేసి వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్లు సోంపు గింజలు వేసి వేయించుకోవాలి.

నాలుగు టేబుల్స్ స్పూన్లు అవిసె గింజలు మ‌రియు నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వుల‌ను కూడా విడిగా వేడిగా వేయించుకుని పెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న‌ నువ్వులు, మెంతులు, అవిసె గింజలు మరియు సోంపు గింజలు వేసుకుని మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ఈ పొడిని వన్ టేబుల్ స్పూన్ చొప్పున‌ ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలపాలి.

ఈ వాటర్ ను ఖాళీ కడుపుతో సేవించాలి.

ఈ వాటర్ ను ప్రతి రోజు క‌నుక తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.

అతి ఆకలి దూరం అవుతుంది.దాంతో బరువు తగ్గి కేవ‌లం కొద్ది రోజుల్లోనూ నాజూగ్గా మారుతారు.

అంతేకాదు ఈ వాటర్ ను తీసుకోవడం వల్ల గుండె పోటుకు దూరంగా ఉండవచ్చు.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌తారు.మరియు రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

దీంతో వివిధ రోగాలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న వారే కాదు.

ఎవ్వ‌రైనా ఈ వాట‌ర్‌ను తీసుకోవ‌చ్చు.

Best Healthy Weight Loss Drink

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube