ఈ విషయంలో చిరంజీవిని క్రాస్ చేసిన బాలకృష్ణ

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ మధ్య పోటీ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తుంది.దాదాపు 30 నుండి 40 సంవత్సరాలుగా ఈ ఇద్దరు హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ వస్తున్నారు.

 Balakrishna First Time Beat Chiranjeevi In Remuneration ,balakrishna,real Estate-TeluguStop.com

అంతే కాకుండా అభిమానుల విషయం లో కూడా వీరిద్దరూ హోరా హోరీగా తలబడుతున్నారు.వ్యక్తిగతంగా ఇద్దరికీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సినిమాల విషయంలో మాత్రం ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు.

సుదీర్ఘ కాలంగా నెంబర్ 1 స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఉండగా ఆ తర్వాత స్థానం లో నందమూరి బాలకృష్ణ ఉన్నాడు.నెంబర్ వన్ స్థానంకు బాలకృష్ణ చేరేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.

కానీ ఎప్పుడూ కూడా చిరంజీవిని క్రాస్ చేసి వెళ్లలేక పోయాడు.ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ని క్రాస్ చేసి.

మెగాస్టార్ చిరంజీవి కంటే తాను ముందు అన్నట్లుగా నందమూరి బాలకృష్ణ నెంబర్ 1 స్థానంలో సొంతం చేసుకున్నాడు.

Telugu Balakrishna, Chiranjeevi, Ad, Estate Ad, Tollywood-Movie

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన యాడ్ లో నటించాడు, అందుకోసం ఏకంగా 15 కోట్ల రూపాయల పారితోషికంను అందుకున్నాడని వార్తలు వస్తున్నాయి.అంతకు కొన్ని నెలల ముందే మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ యొక్క యాడ్ లో నటించాడు.అందుకు గాను చిరంజీవి పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం ఉంది.

అంటే ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కంటే బాలకృష్ణ చాలా ఎక్కువ అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.మొదటి సారి బాలకృష్ణ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో నటించడంతో బ్రాండ్ అంబాసిడర్ గా తన ప్రస్థానంలో మొదలు పెట్టినట్లయితే ముందు ముందు చాలా బ్రాండ్స్ కి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం ఉందని ఆయన అభిమానులు నమ్ముతున్నారు.

వాటన్నింటికీ కూడా చిరంజీవి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube