ఈ రోజుల్లో హిట్.సూపర్ హిట్.
బంఫర్ హిట్.అనే మాటలకు అర్థాలు పూర్తిగా మారిపోయాయి.
వారం రోజులు సినిమా ఆడితేనే ఇండస్ట్రీ రికార్డు అంటూ ఊకదంపుడు ప్రకటనలు ఇస్తున్నారు నిర్మాతలు.కానీ ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు.
సినిమా లాంగ్ రన్ లోనే మంచి వసూళ్లు చేపట్టేవి.ఇప్పుడు టికెట్ హైక్స్ దెబ్బకు తొలి రోజునే వంద కోట్లు సంపాదించిన సినిమాలు కూడా ఉన్నాయి.
అయితే ఇండియన్ సినిమా చరిత్రలో 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ దాటిన తొలి సినిమా ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో ఎన్నడూ లేని సరికొత్త రికార్డును బద్దలు కొట్టిన సినిమా.సూపర్ స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ మూవీ.2007లలో వచ్చిన సినిమా సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో కనీవినీ ఎరుగని విజయం సాధించింది.కోలీవుడ్ లో మాత్రమే కాకుండా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో 100 కోట్లు గ్రాస్ వసూళ్లు అందుకున్న సినిమా చరిత్రకెక్కింది.ఈ సినిమా తెలుగులో 18 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.
మొత్తంగా టోటల్ రన్ లో ఈ సినిమా 133 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 39 సెంటర్లలో 50 రోజులు ఆడింది.భారీగా వసూళ్లు సాధించింది.అటు బాలీవుడ్ లో సైతం ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది.
రజనీ కాంత్ సత్తా ఏంటో ఈ సినిమా ద్వారా యావత్ భారతానికి తెలిసింది.ఈ సినిమా పునాదిగా పడితే దానిపై రోబో అనే భారీ భవనం నిలబడిందని చెప్పుకోవచ్చు.
బ్లాక్ మనీ కేంద్రంగా కొనసాగిన ఈ సినిమా.మంచి జనాదరణ పొందింది.
ఇందులో రజనీ హీరోగా నటించగా.మరో ప్రముఖ నటుడు సుమన్ విలన్ రోల్ ప్లే చేశాడు.
అందాల తార శ్రియ హీరోయిన్ గా నటించింది.మొత్తంగా ఈ సినిమా భారతీయ సినిమా పరిశ్రమకు ఓ మైలు రాయిగా నిలిచింది.