ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఒకప్పుడు విడుదల అయిన సినిమాలను థియేటర్లలో మళ్లీ రీ రీలీజ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే మరో టాలీవుడ్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఆ సినిమా మరేదో కాదు వెంకటేష్( Venkatesh ) మహేష్ బాబు( Mahesh Babu ) కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) సినిమా.
ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొదటిసారి విడుదలైనప్పుడు సూపర్ హిట్ అయింది.ఇప్పుడేమో రీ రిలీజ్‌లోనూ అదే స్థాయిలో రికార్డులను తిరగరాస్తోంది.
అసలు అన్ సీజన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి వారాంతంలోనే భారీ కలెక్షన్లు రాబట్టడం విశేషం.

సాధారణంగా రీ రిలీజ్( Re-Release ) సినిమాలకు వీకెండ్ లోఒక ఓ మోస్తారు వసూళ్లు వచ్చి, తర్వాత బజ్ తగ్గిపోతుంది.కానీ SVSC మాత్రం దీనికి భిన్నంగా సూపర్ స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది.ఇప్పటికే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు మురారి విజయ్ దేవరకొండ ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలు మళ్లీ వచ్చి మంచి బిజినెస్ చేసుకున్నాయి.
కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మాత్రం ఇప్పటివరకు అందరి అంచనాలకన్నా ఎక్కువ రన్ చూపిస్తోంది.తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్ల పరంగా మూడు రోజుల్లోనే 4.75 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.ఈ వేగంతో సినిమా లాంగ్ రన్ లో మరింత హయ్యర్ నంబర్స్ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ రికార్డును సాధించడానికి ప్రధాన కారణం మహేష్ బాబు, వెంకటేశ్ కాంబినేషన్‌తో పాటు సినిమాలో ఉన్న ఎమోషనల్ కనెక్ట్.కుటుంబ కథా చిత్రాలకు ఉన్న క్రేజ్ కారణంగా అన్ని వయస్సుల ప్రేక్షకులు ఈ సినిమాను మళ్లీ తెరపై చూసేందుకు ఆసక్తి చూపించారు.మ్యూజికల్ గా కూడా ఈ చిత్రం అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సెంటిమెంట్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలో కనబడుతోంది.ఇకపోతే ఇప్పటివరకు టాలీవుడ్‌లో రీ రిలీజ్ మూవీస్ హయ్యెస్ట్ కలెక్షన్స్ లిస్టును పరిశీలిస్తే.మురారి 4కె 8.90 కోట్లు గబ్బర్ సింగ్ 4కె 8.01 కోట్లు ఖుషి 7.46 కోట్లు బిజినెస్ మాన్ 4కె 5.85 కోట్లు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 4.75 కోట్లు.3 రోజులు ఆరెంజ్ 4కె 4.71 కోట్లు రెండో రీ రిలీజ్ – 1.35 కోట్లు సింహాద్రి 4కె 4.60 కోట్లు ఈ నగరానికి ఏమైంది – 3.52 కోట్లు ఒక్కడు 4కె 2.54 కోట్లు 7G బృందావన కాలనీ – 1.90 కోట్లు ఇకపోతే SVSC ఇప్పటి వరకు వీకెండ్‌లో అద్భుతమైన రన్ చూపించినప్పటికీ, లాంగ్ రన్‌లో మహేష్ బాబు కెరీర్‌లో అత్యధిక రీ రిలీజ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.