పెళ్లి పీటలెక్కబోతున్న ప్రముఖ హీరోయిన్ అభినయ.. వరుడు ఎవరంటే?

టాలీవుడ్ హీరోయిన్ అభినయ( Heroine Abhinaya ) పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నోసార్లు అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఈ విషయంలో హీరో విశాల్( Vishal ) పేరు ఎక్కువగా వినిపించింది.

 Tollywood Heroine Abhinaya Engaged Details, Abhinaya, Abhinaya Engagement, Tolly-TeluguStop.com

వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వినిపించాయి.కానీ ఆ వార్తలను అభినయ ఖండించిన విషయం తెలిసిందే.

అదే సమయంలోనే తన ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.ఆ ప్రేమ విషయం కాస్త ఇప్పుడు పెళ్లి( Marriage ) వరకు వచ్చినట్టు తెలుస్తోంది.

Telugu Abhinaya, Abhinaya Vishal, Tollywood, Vishal-Movie

తన చిన్ననాటి స్నేహితుడితో అభినయ నిశ్చితార్థం( Abhinaya Engagement ) పూర్తయింది.వారిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నామనే విషయాన్ని అభినయ ప్రకటించింది.గుడిలో గంట కొడుతున్న ఫొటోను పోస్ట్ చేసింది.అందులో తన కాబోయే భర్త చేతిని మాత్రమే చూపించింది.అంతకుమించి వివరాలు వెల్లడించలేదు ఈ బ్యూటీ.అయితే విశాల్ తో డేటింగ్ వార్తల్ని ఖండించిన అభినయ తను ఆల్రెడీ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.

Telugu Abhinaya, Abhinaya Vishal, Tollywood, Vishal-Movie

తన చిన్ననాటి స్నేహితుడితో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని ఆమె తెలిపింది.అయితే పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందని అప్పట్లో వెల్లడించిన ఈ నటి, ఇప్పుడు సడెన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయాన్ని బయటపెట్టింది.అయితే అభినయ తాజాగా అతని ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.కాబోయే భర్తని కూడా చూపించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి తన భర్తను ప్రేక్షకులకు ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి మరి.కాగా అభినయ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube