గ్రీన్ టీతో ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా పెంచుకోవచ్చు.. ఎలాగంటే?

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయాల్లో గ్రీన్ టీ( Green Tea ) ఒకటి.ఇటీవల కాలంలో చాలా మంది త‌మ రెగ్యులర్ డైట్ లో గ్రీన్ టీ ఉండేలా చూసుకుంటున్నారు.

 How To Use Green Tea For Heavy Hair Growth Details, Hair Growth, Hair Growth Ti-TeluguStop.com

వెయిట్ మేనేజ్మెంట్ లో గ్రీన్ టీ ఎంతగానో తోడ్పడుతుంది.ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను అందించే గ్రీన్ టీ కురుల సంరక్షణకు( Hair Care ) సైతం మద్దతు ఇస్తుంది.

గ్రీన్ టీ తో ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా పెంచుకోవచ్చు.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్ట‌వ్‌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు,( Fenugreek ) రెండు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) మరియు ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి దాదాపు ఎనిమిది నుంచి ప‌దినిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరువెచ్చగా అయ్యాక ఒక స్ప్రే బాటిల్ లో నింపుకుంటే హెయిర్ గ్రోత్ టానిక్( Hair Growth Tonic ) అనేది రెడీ అవుతుంది.

Telugu Curry, Fenugreek Seeds, Green Tea, Care, Care Tips, Tips, Tonic, Healthy-

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక వాడితే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్న కొద్దిరోజుల్లోనే దట్టంగా మారుతుంది.జుట్టు రాలే సమస్య దూరం అవుతుంది.

ఈ టానిక్ జుట్టును దృఢంగా మారుస్తుంది.జుట్టు చివర్లు చిట్లడాన్ని నియంత్రించడానికి మరియు కురుల‌కు మెరుపును జోడించడానికి సహాయపడుతుంది.

Telugu Curry, Fenugreek Seeds, Green Tea, Care, Care Tips, Tips, Tonic, Healthy-

అలాగే గ్రీన్ టీలో యాంటీమైక్రోబయల్ ఏజెంట్లు ఉంటాయి, ఇవి తలపై చర్మపు బాక్టీరియా మరియు శిలీంధ్రాలతో పోరాడతాయి.మురికి, మృతకణాలు మరియు జిడ్డును తొలగించి త‌ల‌కు తేమ‌ను అందించ‌డంలో కూడా గ్రీన్ టీ ఉప‌యోగ‌ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube