తెలుగులో ప్రస్తుతం మోస్ట్ ప్రామిసింగ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అడవి శేష్ అనే మాట బాగా వినిపిస్తుంది.ఏకంగా ఆర్ వరస విజయాలు అందుకొని డబల్ హ్యాట్రిక్ హీరో గా రికార్డు సృష్టించాడు.
భిన్నమైన కథలను ఎంచుకొని బెస్ట్ గా దూసుకెళ్తున్నారు.పైగా వరస గా సస్పెన్స్ థ్రిల్లర్స్ చేయడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది.
అప్పుడెప్పుడో వచ్చిన క్షణం సినిమా నుంచి ప్రస్తుతం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న హిట్ 2 సినిమా వరకు అన్ని కూడా జనాల్లో ఆసక్తిని పెంచాయి అని చెప్పడం లో సందేహం లేదు.నిజానికి అడవి శేష్ 2002 లో వచ్చిన సొంతం సినిమాతో నటించడం మొదలు పెట్టాడు.
ఆ తర్వాత ఒక ఎనిమిదేళ్ల వరకు ఎటువంటి సినిమా చేయకుండ అమెరికా వెళ్ళిపోయాడు.
కాస్త సెటిల్ అయ్యాక కర్మ అనే సినిమా తో 2010 లో మల్లి తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు.
ఈ చిత్రం కాస్త భిన్నమైన సినిమా అని అందరు అనుకున్న అది కమర్షియల్ గా హిట్ కాలేదు.కానీ విషయం ఉన్న హీరో అని మాత్రం అనిపించుకున్నాడు.
ఆ తర్వాత మళ్లీ హీరోగా చేయడానికి కాస్త వెనకడుగు వేసి పవన్ కళ్యాణ్ తో పంజా సినిమా లో విలన్ గా చేసాడు.అతడి పాత్రకు మంచి మార్కులే పడ్డ ఆ తర్వాత మరో మూడేళ్లకు కిస్ సినిమా తో హీరోగా మెరిశాడు.
ఈ చిత్రం పరాజయం పాలవ్వడం తో రన్ రాజా రన్ మరియు బాహుబలి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.ఇక అప్పటి నుంచి రూట్ మార్చి క్షణం సినిమాతో హీరో గా నటించడం తో పాటు రచయిత గా కూడా మారాడు.
ఆ తర్వాత 2017 లో అమితుమీ, 2018 లో గూఢచారి సినిమాల్లో నటించాడు.గూఢచారి సినిమా అతడిని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ చేసింది.మూడు వరస విజయాలు రావడం తో మరింత కేర్ తో రాబోయే సినిమాలను తీయాలని భావించి వరస క్రైమ్ థ్రిల్లర్స్ ని తెరకెక్కించడం చేస్తూ వచ్చాడు.2019 లో ఎవరు అనే సినిమా తీయడం తో ఇది సూపర్ హిట్ అయ్యింది.ఆ తర్వాత మహేష్ బాబు పిలిచి మరి తన నిర్మాణంలో మేజర్ సినిమా ఇచ్చాడు.ఈ సినిమా బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో విజయం అందుకుంది.
ఆ తర్వాత హిట్ కి సీక్వెల్ గా హిట్ 2 సినిమా తీయగా ఈ చిత్రం సైతం శేష్ కి మంచి పేరు తో పాటు విజయాన్ని కూడా ఇచ్చింది.ఇలా వరస హిట్లు కొడుతున్న శేష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.