ప్రభాస్.ఈ పేరు తెలియని ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రభాస్ పేరు మార్మోగిపోయింది.బాహుబలి సినిమాకు ముందు టాలీవుడ్ లో రెబల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల డార్లింగ్ గా మాత్రమే కొనసాగాడు ప్రభాస్.
కానీ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.దీంతో ప్రభాస్ తో సినిమాకు అందరూ క్యూ కట్టేస్తున్నారు.
ప్రభాస్ చేస్తున్న సినిమాలు కూడా వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నవే.అయితే ఇంత క్రేజ్ వచ్చిన తర్వాత మాత్రం ప్రభాస్ కు కష్టాలు తప్పడం రేపు అన్నది తెలుస్తుంది.
బాహుబలి తర్వాత సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్ని భాషల్లో విడుదలైంది.అది కూడా భారీ అంచనాల మధ్య.ఈ సినిమా ఫ్లాప్ అయింది.ఇక మొన్నటికి మొన్న వచ్చిన రాధేశ్యాం సినిమా కూడా నిరాశ పరిచింది.ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా నార్త్ ఇండియా దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కనున్న విషయం తెలిసిందే.ఈ పేరు దాదాపు తెలుగు ప్రేక్షకులకు తెలియదు అని చెప్పాలి.
ఇక ఇదే ప్రభాస్ సినిమాకు మైనస్ గా మారబోతుంది అన్నది మాత్రం సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను భారీ రేంజ్లో తెరకెక్కించిన అటు దర్శకుడికి తెలుగులో పెద్దగా బజ్ లేకపోవడంతో తెలుగులో నిర్మాతలు అనుకున్నంతగా బిజినెస్ జరగడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది.కన్నడ భాషలో తప్ప మిగిలిన ఏ భాషలో కూడా ఈ సినిమా బిజినెస్ జరగడం లేదట.కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ ని యాక్షన్ రోల్ లో చూడాలని మాత్రం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారట.
ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమా కంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా పైనే భారీగా ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు.ఇలా పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత కూడా ప్రభాస్ కి ఆది పురుష్ సినిమా విషయంలో కష్టాలు తప్పడం లేదని తెలుస్తోంది.