మణిరత్నం( Mani Ratnam ) ఒక అద్భుతమైన దర్శకుడు.అతడి అభిరుచి, సినిమా మేకింగ్ అన్ని కూడా చాల బాగుంటాయి.
అలాగే కేవలం తమిళ్ లోనే కాకుండా పక్క భాషల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు.కానీ ఇది అంతా గతం.అతడు కేవలం తమిళ దర్శకుడిగా ఇప్పుడు మిగిలిపోయాడు.అందుకు గల కారణం పొన్నియన్ సెల్వం( Ponnian Selvam ) చిత్రం.
ఈ సినిమా కేవలం తమిళ్ లో తప్ప ప్రపంచంలో ఎక్కడ ఆడలేదు సరికదా అయన పేరును కూడా పోగొట్టింది.అయితే తమిళులకు తమిళ వాసన నచ్చుతుంది కానీ పక్కవారికి నచ్చాలంటే కొన్ని అడ్జస్ట్ మెంట్స్ చేయాలి.

అవి చేయడం లో మణిరత్నం గోరంగా విఫలం అయ్యాడు.భారీ చరిత్ర గ్రంధాన్ని తీయాలంటే ప్రేక్షకుల ఆసక్తి, స్క్రీన్ ప్లే, చిత్ర వ్యవధి వంటివి గుర్తెరిగి చేయాల్సి ఉంటుంది.అలాగే వర్తమాన ప్రేక్షకుడికి టైం మీద చాల ఇంట్రెస్ట్.ఎంత తక్కువ టైం పెడితే అంత బాగుంటుంది అనుకుంటారు.కేవలం పాత్రల పరిచయానికి సగం టైం గడిచిపోయాక, తమిళ్( Tamil ) వారికి తప్ప మరొక బాషా వారికి తెలియని ఒక కథని ప్రేక్షకుడి బుర్ర లోకి చొప్పించడం అంటే అది పెద్ద సవాల్.పైగా సీన్ల క్రోడీకరణ, సీక్వెన్స్ కోసం దాచాల్సిన అంశాలు అన్ని కూడా మణిరత్నం యొక్క పేలవ దర్శకత్వాన్ని చూపించాయి.

మొదటి సినిమా లో కథ చెప్పలేకపోవడం ఒక పెద్ద ఫెయిల్యూర్.పైగా అది 10 కోట్ల రూపాయలకు ఒకవేళ మొదటి భాగం అమ్ముడు పోతే అందులో పావులా వంతు కూడా రాలేదు.ఇప్పుడు అందులో పావులా వంతు పెట్టడానికి ఒక్క బయ్యరు దొరకని పరిస్థితి.సినిమా కథ, ,దర్శకత్వం ఎలా ఉన్న కూడా కనీసం సంగీతం పైన ఎలాంటి ప్రత్యేక శ్రద్ద పెట్టకపోవడం ప్రేక్షకుడిని బాగా చిరాకు పెట్టించింది.
అందుకే పొన్నియన్ సెల్వం రెండవ భాగం సినిమా విడుదల కు సిద్ధంగా ఉన్న కూడా కొనాలి అనుకునే వారు లేరు.ఎవరు కొనకపోయిన సరే సినిమాను విడుదల చేయాలనీ డైరెక్టర్ మొండిగా ఉన్నట్టు తెలుస్తుంది.
మరి ఇప్పటికే ఉన్న డబ్బంతా పోగేసి సినిమా తీస్తే ఇక పై రెండవ భాగం ఎవరు కొనకపోతే నిర్మాత రోడ్డు మీద పడటం ఖాయం.