దీర్ఘకాలంగా వేధించే వ్యాధుల్లో షుగర్ వ్యాధి (మధుమేహం) ఒకటి.ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, ఒత్తిడి, పోషకాల లోపం, అధిక బరువు ఇలా రకరకాల కారణాల వల్ల షుగర్ వ్యాధి బారిన పడుతూ ఉంటారు.
ఇలాంటి వారు ఖచ్చితంగా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాల్సి ఉంటుంది.అయితే ఉదయాన్నే కొన్ని కొన్ని ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి ఆ ఆహారాలు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి ఆకు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అలాగే మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలోనూ మెంతి ఆకు ఉపయోగపడుతుంది.ఒక గ్లాస్ నీటిలో మెంతి ఆకులు వేసి రాత్రంతా నానబెట్టి.
ఉదయాన్నే సేవించాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే బ్లడ్ షురగ్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
డయాబెటిస్ రోగులకు అల్లం కూడా గొప్ప ఔషధంలా పని చేస్తుంది.ఒక గ్లాస్ వాటర్‌లో దంచిన అల్లం ముక్క వేసి బాగా మరిగించి వడ బోసు కోవాలి.ఇప్పుడు ఈ వాటర్‌లో తేనె కలిపి ఉదయానే సేవించాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
అలాగే మధుమేహం వ్యాధి గ్రస్తులు బ్రేక్ ఫాస్ట్ ఏవి పడితే అవి కాకుండా ఓట్స్ తీసుకోవడం మేలని అంటున్నారు.ఓట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా బరువు కూడా తగ్గు ముఖం పడుతుంది.
పచ్చి మిర్చి కూడా షుగర్‌ను కంట్రోల్ చేయగలదు.అందువల్ల.మధుమేహం రోగులు ఉదయాన్నే ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ పచ్చి మిర్చి ముక్కలు వేసి సేవించాలి.ఇలా చేయడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
మరియు నీరసం, అలసట వంటి సమస్యలు దూరం అవుతాయి.