ప్రతిరోజూ మొదలవుతుందే పళ్లు శుభ్రం చేసుకోవడంతో… అది కచ్చితం.దాంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు.
ఎందుకంటే ‘ఒరల్ హెల్త్.ఓవర్ ఆల్ హెల్త్’ అంటారు.
కానీ, దీన్ని ౖలైట్ తీసుకునేవారు కూడా ఉన్నారని మీకు తెలుసా? అంటే.రోజూ ఒకసారి మాత్రమే బ్రష్ చేయటం, ఒక్కోసారి అదికూడా చేయకపోవడం, కనీసం ఏడాదికి ఒకసారి అయిన డెంటిస్టును సంప్రదించరు.
ఇవి చాలా సమస్యలకు దారితీస్తాయి.కొంతమంది చెంపల లోపలి భాగం, పళ్లు, చిగుళ్లు శుభ్రంగా ఉండవు.
అటువంటి వ్యక్తులకు నోటి లేదా గొంతు కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.ఫార్టీస్ హాస్పిటల్, ములంద్‌కు చెందిన కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ ఆర్ హితేష్ సింఘ్వీ భారత్‌లో ఓరల్ కేన్సర్ చాలా సాధార ణమైపోయిందని అంటున్నారు.పురుషుల్లో 11.28 శాతం కేవలం ఈ కారణంగానే కేన్సర్ బారిన పడుతున్నారట.ఐదవ జాబితాలో స్త్రీలు 4.3 శాతం కేన్సర్‌తో బాధపడుతున్నవారు ఉన్నారన్నారు.
ప్రధానంగా పొగాకు నమలడం, మద్యపానం, వక్కలు తినడం, నోటి శుభ్రతను పాటిం^è కపోవడం వంటివి కేన్సర్‌కు దారితీస్తాయి.అందుకే నోటి శుభ్రతకు దంతాక్షయం, చిగురువాపు (పీరియాంటైటిస్) చిగుళ్ల వ్యాధికి సంబంధం ఉంటుంది.
ఎక్కువ రోజులు నోటి శుభ్రతను పాటించనివారికి కూడా కేన్సర్ ప్రాణాంతకంగా మారుతుందని డా.హితేష్ అంటున్నారు.ఎక్కువ శాతం ఈ అలవాట్లు ఉన్నవారు నిరక్షరాస్యులేనని చెబుతున్నారు.సామాజిక, ఆర్థిక అవగాహన తక్కువ ఉండటమే ప్రధాన కారణం.
కేన్సర్‌కు దారితీసే విధానం.

పొగాకు, ఆల్కహాల్ వంటి ఇతర కారకాలు కేన్సర్ పీఓహెచ్‌కు సాయపడతాయి.పొగాకు మెటాబోలైట్‌ను కేన్సర్ కలిగించే కారకంగా సులభంగా మారుస్తుంది.పీఓహెచ్ ఆల్కహైడ్‌తో ఆల్కిలైడ్‌ను ఏర్పరుస్తుందని సింఘ్వీ చెప్పారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

పొగాకు దానికి సంబంధించిన ఇతర పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు.దీంతో మీ చిగుళ్లు పాడైపోతాయి.దంతాలును కూడా వదులుగా చేస్తుంది.
గాయాలు ఏర్పడతాయి.ఆల్కహాల్‌కు దూరంగా ఉండటంతో కూడా ఓరల్ హైజీనిక్ మెయింటెన్ అవుతుంది.
దీనికి ఓ ఉదాహారణ.ఆల్కహాల్ తీసుకునేవారి నోటి నుంచి దుర్వాసన ఎక్కువ శాతం వస్తుందని మనం సులభంగా గ్రహించవచ్చు.
ఎక్కువ గార పట్టడంతోపాటు చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతాయని ఎన్నో రుజువులు ఉన్నాయని ఆయన అంటున్నారు.బక్కల్ ముకోసా చాలా సాధారణమైన ఓరల్ క్యావిటీ కేన్సర్.
కొన్ని సర్వేల ప్రకారం నోటి పరిశుభ్రతను ఎక్కువ పాటిస్తే ఓరల్ కేన్సర్‌కు 200 శాతం చెక్ పెట్టవచ్చని సింఘ్వీ తెలిపారు.