బస్సులో పురిటినొప్పులతో విలవిల్లాడిన మహిళా.. కానిస్టేబుల్ చేసిన పనికి..!?

మహిళా కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకుంది.పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ కు అండగా నిలిచి తల్లి బిడ్డ క్షేమంగా ఆసుపత్రికి చేర్చింది ఈ అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

 Woman Constable Saved The Life Of Pregnant Woman In Up, Woman Constable, Saved T-TeluguStop.com

లక్నో పట్టణంలోని జలాలాబాద్  ప్రాంతానికి చెందిన రేఖ తన భర్తతో కలిసి ఉంటుంది.కాగా గర్భవతి.

  అయిన ఆమె పురిటి నొప్పులు రావడంతో.నొప్పులతో బాధపడుతుంది దీంతో ఆస్పత్రికి  బస్సులో షాహజన్ పూర్ బయలుదేరింది.

బస్సులోని కుదుపులు కారణంగా ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి.దీంతో బస్సు ను రోడ్డు పక్కకి నిలిపివేసి అంబులెన్స్ కు సమాచారం అందించారు.

విపరీతంగా నొప్పులు ఎక్కువ అవడంతో విలవిలలాడది.ఈ క్రమంలో “బింటూ పుష్కర్ ” అనే మహిళా కానిస్టేబుల్ అదే బస్సులో ప్రయాణిస్తుంది.

సమయానికి ఆంబులెన్స్ రాలేదు విపరీతంగా నొప్పులు పెరగడంతో ఆందోళనకు లోనయ్యారు.ఆ కానిస్టేబుల్ వారిద్దరికీ ధైర్యం చెప్పింది అంతటితో ఆగకుండా రేఖ తల్లితో కలిసి చీరను అడ్డుగా పెట్టి ఆమెకి పురుడు పోసింది.

రేఖ బాలికకు జన్మనిచ్చింది.తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఈ క్రమంలో కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అంబులెన్స్ తల్లి బిడ్డను దగ్గరల ఉన్న దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.దీంతో బస్సులో ప్రయాణించే మిగతా ప్రయాణికులు అంతా సంతోషపడ్డారు మహిళా కానిస్టేబుల్ ను పొగడ్తలతో ముంచెత్తారు.ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.కష్టకాలంలో మహిళలకు అండగా నిలిచినందుకు ఆ కానిస్టేబుల్ కు నెటిజన్లు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube