మల్లారెడ్డి మాటలకు అసెంబ్లీలో నవ్వులు పువ్వులు పూశాయి!

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ రాజకీయ నాయకుడు సి.హెచ్.మల్లారెడ్డి( C.H.Mallareddy ) గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డి తెలంగాణ రాజకీయాలపై( Telangana Politics ) తనదైన ముద్ర వేసాడు.2019 ఫిబ్రవరి 19న కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లారెడ్డి 2014లో మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యాడు.ఇక తనదైన చతురత మాటలతో బి ఆర్ యస్ హయాంలో మల్లారెడ్డి టాక్ అఫ్ ది టౌన్ గా మారిన సంగతి అందరికీ తెలిసినదే.‘పూలమ్మినా… పాలమ్మినా’ అనే అతని మాటలకు పేరడీ పాటలు కూడా వచ్చిన సంగతి విదితమే.

 Mallareddy Funny Comments Viral In Assembly Details, Latest News , Mallareddy, B-TeluguStop.com
Telugu Brs Mla Malla, Congress, Ghmc, Latest, Malla, Sridhar Babu-Latest News -

అసలు విషయంలోకి వెళితే… బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో( Assembly ) తాజాగా నవ్వులు పూయించారు.ఆయన మాట్లాడేందుకు నిలబడగా.మల్లారెడ్డి అంటే మీరే కదా? అని స్పీకర్ ఓ వైరైటీ ప్రశ్న వేయగా… ధన్యవాదాలు అధ్యక్షా! అంటూ మల్లారెడ్డి షురూ చేసారు.తాను 2 విషయాలు చేప్తానని.అందులో ఒకటి ప్రభుత్వానికి 1100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది? ఒక విషయం కాగా… రెండోది తన మేడ్చల్ నియోజకవర్గానికి( Medchal Constituency ) చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల, సర్పంచ్ లు చాలా బాధలో ఉన్నారు! అనే విషయం గురించి మాట్లాడాలి అన్నారు.దాంతో ఇందులో ఏదో ఒక విషయం గురించి మాత్రమే మాట్లాడాలని స్పీకర్ అనగా… సభలో అందరూ నవ్వారు.

Telugu Brs Mla Malla, Congress, Ghmc, Latest, Malla, Sridhar Babu-Latest News -

ఈ క్రమంలోనే మల్లారెడ్డి మాట్లాడుతూ… మేడ్చల్ నియోజవర్గానికి దిష్టి బాగా తగిలింది.61 గ్రామాలు పోయి అన్నీ మున్సిపాలిటీలుగా మారిపోయాయి అని వాపోయారు.మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలుండగా.

మరో 3 మున్సిపాలిటీలు చేశారని.దయచేసి తమకు సేమ్ రిజర్వేషన్ ఉంచాలని అసెంబ్లీ వేదికగా మల్లారెడ్డి వేడుకున్నారు.

అంతే కాకుండా వారిని GHMCలో కలపొద్దంటూ మంత్రి శ్రీధర్ బాబును మల్లారెడ్డి కోరడం జరిగింది.అయితే ఈ సందర్భంగా ఒక కామెడీ కూడా జరిగింది.

ప్రభుత్వానికి పదుకొండ వందల కోట్ల రూపాయల ఆదాయం… అనే అంశం గురించి మాట్లాడుతుండగా.స్పీకర్ మైక్ కట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube