జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..?

పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ప్రైస్ వీటిని చూస్తే ఎవరైనా తినకుండా ఉండలేరు.ఎంతో రుచిగా ఉండే వాటిని చూస్తే తినకుండా ఉండాలంటే అసలు సాధ్యపడదు.

 Are You Eating A Lot Ofjunk-food .. But You Don't Have These Problems..? , Junk--TeluguStop.com

జంక్ ఫుడ్ తినడం వల్ల డీప్ స్లీప్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తెలిసింది.ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేవారితో పోలిస్తే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే వారి నిద్ర నాణ్యత తగ్గిపోతుందని పరిశోధకులు కనుగొన్నారు.

సరైన ఆహారం తీసుకోకపోవడం పేలవమైన నిద్ర రెండు అనేక ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతాయి.ఎక్కువ చక్కెర స్థాయి ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టదని ఎపిడెమియోలాజికల్( Epidemiological ) అధ్యయనాలు సూచిస్తున్నాయి.

మనం తినే వాటి ద్వారా గాఢ నిద్ర ప్రభావితం అవుతుంది.అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఏం జరుగుతుందన్న విషయం గురించి ఏ అధ్యయనంలోనూ పరిశోధించలేదు.

Telugu Epidemiological, Tips, Insomnia, Junk, Problem-Telugu Health Tips

నిద్రలో హార్మోన్ల విడుదలని నియంత్రించే గాడ నిద్ర వివిధ దశలను కలిగి ఉంటుంది.ఉత్సల విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో 15 మంది వ్యక్తులు పాల్గొన్నారు.వీరి నిద్ర అలవాట్లు పరిశీలించారు.వాళ్లకు సిఫారసు చేసిన దాని ప్రకారం సగటున రాత్రి 7 నుంచి 9 గంటల నిద్రపోయారు.వాళ్లకి అనారోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం రెండు ఇచ్చారు.రెండు ఆహారాలు ఒకే విధమైన కేలరీలు కలిగి ఉన్నాయి.

Telugu Epidemiological, Tips, Insomnia, Junk, Problem-Telugu Health Tips

ఒక వారం పాటు ఇలాగే ఆహారం ఇచ్చారు.మొదటి రోజు రాత్రి నిద్ర బాగానే ఉంది.ప్రతిరోజు ఇదే విధంగా వారినీ పరీక్షించారు.ఇలా సెషన్ లో పాల్గొనేవారు రెండు డైట్ తీసుకున్నప్పుడు ఒకే సమయంలో నిద్ర పోతారు.రెండు ఆహారాలు తీసుకున్నవాళ్లు వేరువేరు నిద్ర దశాలలో ఒకే సమయాన్ని గడిపారు.కానీ వారి గాఢ నిద్ర లక్షణాలు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పోలిస్తే జంక్ ఫుడ్ తిన్నప్పుడు గాఢ నిద్ర తక్కువ స్లో వేవ్ యాక్టివిటీని కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు.ఇలా జంక్ ఫుడ్( Junk-Food ) తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య( Insomnia )లతో పాటు మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube