ఇండస్ట్రీలో చాలామంది మోసగాళ్లు సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తాము అంటూ లక్షలకు లక్షలు డబ్బులు తీసుకుని ముఖం చాటేయడం లాంటివి చేస్తూ ఉంటారు.ఇప్పటికే గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అని ప్రయత్నిస్తున్న వారికి నమ్మించి మాయమాటలు చెప్పి ఇప్పటికే చాలామంది మోసం చేశారు.ఇంకా కొంతమంది అమ్మాయిలను మోసం చేయడం వారిని వాడుకొని వదిలేయడం లాంటివి కూడా చేశారు.
ఇదేవిధంగా ఒక నటుడు యువతుల పై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆ కేసులలో విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష( 30 Years Jail ) విధించింది.

ఆ నటుడు మరెవరో కాదు.అమెరికాకు( America ) చెందిన నటుడు డాని మాస్టర్ సన్.( Actor Danny Masterson ) నాలుగేళ్ల వయసులోనే చైల్డ్ మోడల్ గా కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించాడు.కాగా అత్యాచారం కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డానీ మాస్టర్ సన్ ను కోర్టు నిందితుడుగా తేల్చింది.
పలువురు యువతుల పై అత్యాచారాలకు పాల్పడినందుకు ఆ నటుడికి 30 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పుని ఇచ్చింది.ఇదిలా ఉండగా యువతులపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న డానీ మాస్టర్ సన్ ను 2017లో నెట్ ఫ్లిక్స్ ది రాంచ్( The Ranch ) అనే కామెడీ ప్రోగ్రం నుంచి తొలగించింది.
అయితే డానీ మాస్టర్ సన్ 2001లో 23 ఏళ్ల వయసున్న ఒక యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

2003లో 28 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.మళ్లీ 2003వ సంవత్సరం చివరలో 23 ఏళ్ల వయసున్న మరో యువతిపై అత్యారానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి.అయితే ఈ కేసులపై న్యాయస్థానం 2020లో విచారణ జరిపి జైలు శిక్ష విధించింది.
దీంతో డానీ మాస్టర్ సన్ ను పోలీసులు అరెస్టు చేశారు.అయితే డానీ మాస్టర్ సన్ 3.3మిలియన్ డాలర్లు చెల్లించి జైలు నుంచి విడుదల అయ్యారు.దీనిపై బాధితులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజాగా విచారణ జరిపిన కోర్టు డానీ మాస్టర్ సన్ ను నిందితుడిగా తేల్చి 30 ఏళ్లు జైలు శిక్షను విధించింది.
కోర్టులో న్యాయమూర్తి తీర్పు ప్రకటించిన సమయంలో డానీ మాస్టర్ సన్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోగా, ఆయన భార్య బిజు ఫిలిప్స్ న్యాయస్థానంలోనే విలపించింది.