వారంలో ఒక్క‌సారి ఈ ప్యాక్ వేసుకుంటే పొడ‌వాటి కురులు మీసొంత‌మ‌వుతాయి!

పొడ‌వాటి జుట్టు కావాల‌నే కోరిక దాదాపు ప్ర‌తి అమ్మాయికి ఉంటుంది.కానీ, ఇటీవ‌ల రోజుల్లో చాలా మందికి అది అసాధ్యంగా మారింది.

 Super And Effective Pack For Long Hair! Hair Pack, Long Hair, Hair Care Tips, Ha-TeluguStop.com

ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల లోపం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం వంటి కార‌ణాల వ‌ల్ల జుట్టు ఎదుగుద‌ల ఆగిపోతుంది.దాంతో ఏం చేయాలో తెలియ‌క లోలోన మ‌ద‌న ప‌డుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ హెయిర్ ప్యాక్‌ను వారంలో ఒక్క‌సారి వేసుకుంటే చాలు పొడ‌వాటి కురులు త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఆల‌స్యం ఎందుకు ఆ హెయిర్ ప్యాక్ కు  ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా కొన్ని కొబ్బ‌రి ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా రుబ్బుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మం నుంచి కొబ్బ‌రి పాల‌ను మాత్రం వేరుసుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో ఒక ఫుల్ ఎగ్‌, అర క‌ప్పు కొబ్బ‌రి పాలు, మూడు టేబుల్ స్పూన్ల మెంతి పౌడ‌ర్‌, రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్, ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే హెయిర్ ప్యాక్ సిద్ధ‌మైన‌ట్టే.

ఇప్పుడు ఈ ప్యాక్‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మొద‌ట మీరు రెగ్యుల‌ర్‌గా వాడే ఆయిల్‌ను లైట్‌గా వేడి చేసి జుట్టుకు ప‌ట్టించాలి.ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న ప్యాక్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా వారంలో ఒక్క‌టంటే ఒక్క‌సారి చేయ‌డం వ‌ల్ల కురుల‌కు మంచి పోష‌ణ అంది పొడ‌వుగా, ఒత్తుగా పెరుగుతుంది.చాలా మంది స్ప్లిట్ హెయిర్ స‌మ‌స్య‌తో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతుంటారు.అయితే ఈ ప్యాక్ వేసుకోవ‌డం వ‌ల్ల జుట్టు చిట్ల‌డం, పొట్లిపోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

మ‌రియు ఈ ప్యాక్ వ‌ల్ల జుట్టు స్మూత్ అండీ షైనీగా మెరుస్తుంది.

Super And Effective Pack For Long Hair! Hair Pack, Long Hair, Hair Care Tips, Hair Care, Latest News, Beauty, Beauty Tips - Telugu Tips, Care, Care Tips, Pack, Latest, Long

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube