పూర్వకాలంలో మహిళలు కేవలం కొన్ని పనులకు మాత్రమే పరిమితమయ్యే వారు.అయితే రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో పురుషులతో పోటీగా రాణిస్తున్నారు.
ప్రతి రంగంలోనూ మహిళలు ఏం తక్కువ కాదంటూ అన్ని రంగాలలో తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.ఇలా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెంది మనుషులలో మార్పు వస్తున్నప్పటికీ, ఇప్పటికి మన దేశంలో కొన్ని ఆలయాలలో ఆడవారి పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది.
మన దేశంలో కొన్ని ఆలయాలలో ఎప్పటికీ మహిళలకు అనుమతి లేదు.మరి అలాంటి ఆలయాలు మన దేశంలో ఎక్కడ ఉన్నాయి ఏంటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
శబరిమల:
శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంలోకి 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలను ఇప్పటికీ ఆలయంలోకి అనుమతించరు.అయ్యప్పస్వామి జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేయటంవల్ల ఆలయంలోకి యువతులకు ప్రవేశం ఉండదని చెబుతారు.

హర్యాన కార్తికేయ గుడి: పురాణాల ప్రకారం కార్తికేయుడు కఠోరమైన దీక్షలో ఉండటంవల్ల బ్రహ్మ తనకన్నా ఎన్నో శక్తులను పొందుతాడని భావించి కార్తికేయుడు తపస్సు భగ్నం చేయడానికి భూలోకంలో ఒక అప్సరసను పంపి తపస్సును భగ్నం చేయించాడు.దీంతో ఆగ్రహించిన కార్తికేయుడు తన శాపంతో ఆ అప్సరసను రాయిగా మార్చాడు.అప్పటి నుంచి ఈ ఆలయంలోకి మహిళలు వెళితే రాయిగా మారుతారన్న ఉద్దేశంతో ఈ ఆలయంలోకి స్త్రీలను అనుమతించరు.
మవాలి మాత చత్తీస్ ఘర్: ఈ ఆలయంలో కొలువైన మా వాలి మాత అమ్మవారు ఒక రోజు ఆలయ అర్చకుల కలలో భూమిని చీల్చుకుంటూ కనిపించి తన ఆలయానికి మహిళలు అనుమతి లేదని తెలియజేశారని, అప్పటి నుంచి అమ్మవారి ఆలయానికి కేవలం మగవారు మాత్రమే వస్తున్నారు.ఈ ఆలయాలు మాత్రమే కాకుండా హాజీ అలీ దర్గా, కేరళలోని శ్రీకృష్ణదేవరాయల ఆలయం,జనక్ పూర్ జైన టెంపుల్, పత్బాసి సత్ర అస్సాం, వంటి ఆలయాలలో కి కూడా మహిళలను అనుమతించరు.