ఆరవ రోజు అలిగిన బతుకమ్మకు నైవేద్యం ఎందుకు పెట్టారో తెలుసా..?

మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను( Bathukamma festival ) ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డల పండుగ బతుకమ్మ అని కూడా చెబుతారు.

 Alighina Bathukamma Do You Know Why The Offering Was Made To Alighina Bathukamma-TeluguStop.com

తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతికగా నిలుస్తుంది.ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వీధిలో సందడిగా జరుపుకుంటారు.

మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే సంబరాలు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో పూర్తి అవుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే బతుకమ్మ సంబరాలలో ఆరో రోజు ఆశ్వయుజ పంచమి( Aswayuja Panchami ) అలిగిన బతుకమ్మ అని కూడా పిలుస్తారు.

ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు.

Telugu Scholars, Telangana-Telugu Bhakthi

అందుకే పూలతో బతుకమ్మను తయారు చేయరు.అలాగే గౌరమ్మకు ఎలాంటి నైవేద్యం ఉండదు.కానీ ఆడపడుచులు అంతా అమ్మవారికి అలకతీరాలని ఇంటి ముందు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ పూజిస్తారు.

పూర్వ కాలంలో బతుకమ్మ పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో బతుకమ్మ అలిగి వెళ్లిపోయిందని పండితులు( Scholars ) చెబుతున్నారు.అందుకే ఆరో రోజు బతుకమ్మను పేర్చరు.

అలాగే ఆ రోజు నైవేద్యం కూడా పెట్టారు.ఇంకా చెప్పాలంటే ఆరో రోజు బతుకమ్మను ఆలిగిన బతుకమ్మ అని కూడా అంటారు.

ఈ రోజు బతుకమ్మకు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించారని పండితులు చెబుతున్నారు.

Telugu Scholars, Telangana-Telugu Bhakthi

అలాగే ఏడవ రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ( Vepakayala Batukamma ) అని పిలుస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే బియ్యం పిండితో చేసే వేపకాయలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.ఈ వేప కాయలను ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి, రెండు స్పూన్ల నువ్వులు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.అందులో గోరు వెచ్చని నీరు పోసి చపాతీ ముద్దలా తయారు చేసుకోవాలి.

ఆ ముద్దను వేపకాయల్లా చేతిలో నొక్కుకుని నూనెలో వేయించాలి.అంతే వేపకాయల ప్రసాదం తయారవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube