ముస్లీంలు…786 అనే నెంబర్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలుసా? వెనకున్న రహస్యం ఇదే..!

దర్గాల మీద, మజీద్ ల దగ్గర మనకు ఎక్కువగా 786 అని రాసి ఉంటుంది.చాలా మంది ముస్లీం సోదరులు …తమ బండి నెంబర్ లేదా ఫోన్ నెంబర్ లో 786 ఉండాలని కోరుకుంటుంటారు.

 Why Muslim Believe In 786-TeluguStop.com

అసలు ముస్లీం లు 786 అనే నెంబర్ కు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అసలు ఈ 786 నెంబర్ యొక్క అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

5వ శతాబ్దంలో పుట్టిన అరబిక్ బాషలో 28 అక్షరాలుంటాయి….అబ్జద్ న్యూమరల్స్ ప్రకారం….అరబిక్ భాష లోని 28 అక్షరాలకు ఒక్కొక్క నెంబరింగ్ ఇవ్వడం జరిగింది.కింద పట్టికలో ఆ నెంబరింగ్ ను చూడొచ్చు.78-2
ముస్లీంల పవిత్ర గ్రంథమైన ఖురాన్ లో స్టార్టింగ్ ” బిస్మిల్లాహ్ ఇర్-రహమాన్ ఇర్-రహీమ్” ( అత్యంత సహనశీలి, త్యాగమూర్తి అయిన అల్లాహ్ పేరు మీదుగా) అని ఉంటుంది.786
పై టేబుల్ లోని విలువల ప్రకారం “Bismillah ir-Rahman ir-Rahim” అనే పవిత్ర వాక్యం రాయడానికి ఉపయోగించే అక్షరాల న్యుమెరిక్ వాల్యు లను కలిపితే 786 వస్తుంది.

” బిస్మిల్లాహ్ ఇర్-రహమాన్ ఇర్-రహీమ్” అని పలుకుతూ…ఏ కార్యమైన మొదలు పెడితే మంచిదని తలిచి….

“Bismillah ir-Rahman ir-Rahim” అనే వాక్యానికి సింబాలిక్ గా 786 అని రాస్తారు.అయితే….సౌత్ ఈస్ట్ ఏసియాలోనే….ఈ నెంబర్ కు అధిక ప్రాధాన్యత ఇస్తారట.

ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్ లలో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube