కొత్త ఏడాదిలోపు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే సిరి సంపదలు మీ వెంటే?

మరికొన్ని రోజులలో కొత్త ఏడాది రానుండడంతో కొత్త ఏడాది పై ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు.ఈ ఏడాది చాలామంది వివిధ రకాలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉండడం వల్ల వచ్చే ఏడాది అయినా జీవితంలో వెలుగులు నిండాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు.

 Bring These Five Items-to Home Before New Year 2022 For Money New Year 2022, Bri-TeluguStop.com

ఈ క్రమంలోనే కొత్త ఏడాది అంతా శుభప్రదంగా సిరిసంపదలతో కొనసాగాలంటే కొన్ని రకాల శుభకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం ఎంతో ఉత్తమమని పండితులు చెబుతున్నారు.మరి కొత్త ఏడాది వచ్చే లోగా ఏ రకమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

శుభకార్యాలలో ఎంతో పవిత్రంగా భావించే స్వస్తిక్ చిహ్నం ఇంట్లో ఉండటం ఎంతో శుభకరం అని పండితులు చెబుతున్నారు.ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మనకు మంచిగా జరగాలంటే కొత్త సంవత్సరం వచ్చేలోగా స్వస్తిక్ చిహ్నాన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిది.

అలాగే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మొక్కలలో తులసి మొక్క ఒకటి.అందుకే ప్రతి ఒక్కరు తులసి మొక్కను ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తుంటారు.

తులసి మొక్క ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబంలో ఎలాంటి లోటు లేకుండా ఇంట్లో ధనధాన్యాలతో సిరి సంపదలతో కళకళలాడుతూ ఉంటుంది.కనుక ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో తులసి మొక్కను ఉంచడం ఉత్తమం.

Telugu Itemss, Pooja-Telugu Bhakthi

మన ఇంట్లో సంతోషాలకు, సుఖాలకు ప్రతీకగా శంఖాన్ని భావిస్తారు.అందుకే ఇంట్లో శంఖం ఉండటం ఎంతో మంచిది.ఒకవేళ మీ ఇంట్లో శంఖం లేకపోతే వచ్చే ఏడాదిలోగా శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. శంఖంతో పాటు లక్ష్మీదేవి పాదాలను ఇంటిలో పెట్టుకోవడం ఎంతో శ్రేయస్కరం.

అమ్మవారి పాదాలను మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల మన ఇంట్లో ఎల్లప్పుడు సంతోషాలు వెల్లివిరుస్తాయి.అలాగే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు.వీటితో పాటు నెమలీక కూడా శుభానికి సంకేతంగా భావిస్తారు అందుకే నెమలి పింఛం ఇంట్లో ఉండటం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube