భారీ అంచనాల మధ్య విడుదలైన జవాన్ ( Jawan ) సినిమా అభిమానుల అంచనాలను మించుతూ థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇప్పటికే ఈ సినిమా చూడడానికి ఎంతో మంది అభిమానులు థియేటర్లకు పరుగులు తీస్తున్న వేళ తాజాగా ఈ సినిమా గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది.

అదేంటంటే.ఈ సినిమా చేయాల్సింది షారుక్ ఖాన్ ( Sharukh khan ) కాదట.మన టాలీవుడ్ లోని ఆ ఇద్దరు హీరోలలో ఎవరో ఒకరు చేయాల్సి ఉండగా వాళ్ళిద్దరూ రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా షారుక్ ఖాన్ చేతికి వెళ్లిందట.మరి ఇంత మంచి సినిమాని రిజెక్ట్ చేసిన ఆ ఆ టాలీవుడ్ అన్ లక్కీ హీరోస్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరైనా దర్శకుడు సినిమా తీద్దాం అనుకునే టైంలో ఒక హీరోని ఊహించుకొని కథ రాసుకుంటే ఆ సినిమాలోకి మరో హీరో వచ్చి చేరుతారు.ఇలా ఎన్నో సినిమాల్లో ఒక హీరోతో చేయాల్సి ఉండగా మరో హీరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే జవాన్ సినిమా చేయాల్సింది కూడా షారుక్ ఖాన్ కాదట.ఈ సినిమా కోసం ముందుగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ( Atlee ) టాలీవుడ్ లోని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేదా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించాలి అనుకున్నారట.
కానీ ఈ ఇద్దరు హీరోలకు కథ చెప్పి ఇద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.కానీ అట్లీ బ్యాడ్ లక్ ఏంటంటే.
ఇద్దరికి కథ చెప్పిన ఇద్దరు ఈ సినిమాని కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశారట.అనుకోకుండా ఈ సినిమా షారుక్ ఖాన్ కి చెప్పి ఆ సినిమా నచ్చడంతో షారుక్ ఖాన్ జవాన్ (Jawan) సినిమాకి ఓకే చేసి పూర్తి నమ్మకం డైరెక్టర్ అట్లీ మీద పెట్టుకున్నారు.

ఇక షారుఖ్ ఖాన్ నమ్మకాన్ని పోగొట్టకుండా తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను తెరకెక్కించి బ్లాక్బస్టర్ హిట్ ని అందించారు.అయితే ఈ విషయం తెలియగానే చాలామంది టాలీవుడ్ జనాలు అబ్బా జస్ట్ మిస్.ఈ సినిమా రామ్ చరణ్ ( Ram charan ) లేదా మహేష్ బాబు చేసి ఉంటే బాగుండేది కదా అని కామెంట్స్ పెడుతున్నారు.అంతేకాదు ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.
ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు మహేష్ బాబు( Mahesh babu ) , రామ్ చరణ్ కూడా కాస్త బాధపడుతున్నట్టు తెలుస్తుంది.







