నెలసరి సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల కొందరు మహిళలు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు.ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలా మంది చిరుతిండ్లపై పడుతుంటారు.
కొందరైతే ఆల్కహాల్‌ను సైతం సేవిస్తుంటారు.అసలు నెలసరి సమయంలో ఆల్కహాల్ తీసుకోవచ్చా.? ఆ టైమ్‌లో ఆల్కహాల్ తీసుకోవడం లాభామా.? నష్టమా.? అంటే ఖచ్చితంగా నష్టమనే చెబుతున్నారు నిపుణులు.
వాస్తవానికి ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమే.కానీ, దానిని తీసుకోవాల్సిన పద్ధతుల్లో తీసుకుంటే ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు లభిస్తాయని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.ఈ నేపథ్యంలోనే ఇటీవల రోజుల్లో పురుషులతో పాటుగా స్త్రీలు కూడా ఆల్కహాల్‌కి బాగా అలవాటు పడ్డారు.
అయితే స్త్రీలు ఆల్కహాల్ సేవించడం తప్పు కాదు.
కానీ, నెలసరి సమయంలో మాత్రం దాని జోలికే వెళ్లరాదని చెబుతున్నారు.
ఎందు కంటే, ఆ సమయంలో ఆల్కహాల్‌ను సేవించడం వల్ల శరీరం వేగంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది.ఫలితంగా కళ్లు తిరగం, తల నొప్పి, నోరు తడారి పోవడం, వికారం, వాంతులు, గుండె దడ, కండరాల నొప్పులు వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అంతే కాదు, నెల సరి సమయంలో ఆల్కహాల్‌ను తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.దాంతో గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుయి.
అందుకే మహిళలు నెల సరి సమయంలో ఆల్కహాల్‌ను తీసుకోక పోవడమే ఆరోగ్యానికి మంచిది.ఇక ఆల్కహాల్‌తో పాటుగా నూనెలో వేయించిన ఆహారాలు, షుగర్ తో తయారు చేసిన ఆహారాలు, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు, బేక్ చేసిన ఆహారాలకూ దూరంగా ఉంటాలి.
మరి ఆ సమయంలో ఏం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అన్న సందేహం మీకు రావచ్చు.నట్స్, తాజా పండ్లు, ఆకుకూరలు, డార్క్ చాక్లెట్, హెర్బల్ టీ వంటివి తీసుకుంటే నెలసరి తేలిగ్గా గడిచిపోతుంది.