ఇటీవల కాలంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.ఈజీగా డబ్బులు సంపాదించాలని, అలవాటు మార్చుకుని చోరీలకు( Thefts ) పాల్పడుతున్నారు.
ప్రత్యేకంగా ఒంటరిగా ఉన్న మహిళలు, వయసు పైబడిన పెద్దలను టార్గెట్ చేస్తూ ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు.వీరు సాధారణంగా బైక్‌లపై వచ్చి ఏదో అడ్రస్ అడిగినట్లు నటించడం, తాగేందుకు నీళ్లు( Water ) కావాలని అడగడం లాంటి మార్గాలను ఉపయోగిస్తున్నారు.వీరి మోసపూరిత ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం.ఇలాంటి ఘటనల వల్ల చైన్ స్నాచింగ్,( Chain Snatching ) లూటీలు ఎక్కువగా జరుగుతున్నాయి.ప్రధానంగా నడిరోడ్డుపై వెళ్తున్న మహిళలు వీరి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు.వీటికి సంబంధించిన ఘటనలు రోజూ వార్తల్లో వింటూనే ఉన్నాయి.
నేటి డిజిటల్ యుగంలో సీసీటీవీలు ఉన్నా కూడా దొంగలు ఏదోక మార్గంలో తప్పించుకుంటున్నారు.సోషల్ మీడియాలోనూ ఈ సంఘటనలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇది ఇలా ఉండగా తాజాగా, హైదరాబాద్‌లోని ( Hyderabad ) కేపీహెచ్‌బీ కాలనీలో దొంగతనం జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది.టెంపుల్ బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో, ఒక మహిళ ఇంటి పనుల్లో బిజీగా ఉంది.
అదే సమయంలో ఓ వ్యక్తి గేటు దగ్గరకు వచ్చి నీళ్లు కావాలని అడిగాడు.ఎండాకాలం కావడంతో, మంచితనంతో ఆమె లోపలికి వెళ్లి నీళ్లు తీసుకురావడానికి వెళ్లింది.అయితే, అతను నిజానికి దొంగ అని ఆమెకు అసలు అనుమానం రాలేదు.

ఆమె నీళ్లు తీసుకురావడానికి లోపలికి వెళ్లగానే, ఆ వ్యక్తి వెనుకే వెళ్లి ఇంట్లోకి ప్రవేశించాడు.అతను క్షణాల్లోనే ఇంట్లో ఎవరు లేరని నిర్ధారించుకుని, ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు.వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు గమనించారు.
కానీ, అప్పటికే ఆ దొంగ జెట్ స్పీడ్‌లో పారిపోయాడు.

ఈ చోరీ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.దొంగ తన ముఖాన్ని కనిపించకుండా ఉండేందుకు క్యాప్ పెట్టుకుని వచ్చాడు.ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
దొంగతనం ఎంత పెరిగిపోయిందో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు భయంతో పాటు కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఇప్పుడు ఎవరికైనా సహాయం చేయాలంటే భయమే’’ అంటూ కొందరు కామెంట్ చేయగా, ‘‘పాపం అనుకుంటే మనకే చెడు జరుగుతోంది’’ అంటూ మరికొందరు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.
అనుమానాస్పద వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు.ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు అపరిచిత వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలి.
సామాజికంగా అవగాహన పెంచుకుని, అటువంటి మోసగాళ్ల నుంచి మన భద్రతను కాపాడుకోవడం అత్యంత అవసరం.







