గత రెండు రోజులుగా సౌందర్య( Soundarya ) ఆస్తులను మోహన్ బాబు( Mohan Babu ) ఆక్రమించుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి.మంచు ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలు తగ్గించేలా వైరల్ అయిన ఈ వార్తల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సౌందర్య భర్త ఈ వార్తల గురించి రియాక్ట్ అవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట ఒకింత హాట్ టాపిక్ అవుతున్నాయి.
హైదరాబాద్ లో సౌందర్య ఆస్తులకు( Soundarya Properties ) సంబంధించి గత కొన్నిరోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని సౌందర్య భర్త( Soundarya Husband ) అన్నారు.
సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నారని జరిగిన ప్రచారాన్ని నేను ఖండిస్తున్నానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆయనతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదని సౌందర్య భర్త వెల్లడించారు.
మోహన్ బాబు ఫ్యామిలీతో 25 సంవత్సరాలుగా అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు.

నేను మోహన్ బాబును ఎంతో గౌరవిస్తానని సౌందర్య భర్త చెప్పుకొచ్చారు.మేమంతా ఒకే ఫ్యామిలీగా ఉంటామని మాకెలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవని సౌందర్య భర్త కామెంట్లు చేశారు.సౌందర్య భర్త కామెంట్లతో మోహన్ బాబు గురించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని కొంతమంది కావాలని ఈ తరహా ప్రచారం చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి చేసిన ఆరోపణల వల్ల ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి.మోహన్ బాబు ప్రస్తుతం కుటుంబ వివాదాల వల్ల ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచారు.ఇలాంటి తరుణంలో ఈ తరహా వార్తలు వెలుగులోకి రావడం హాట్ టాపిక్ అవుతోంది.రాబోయే రోజుల్లో మోహన్ బాబు ఫ్యామిలీ ఈ తరహా ఫేక్ వార్తలు ప్రచారంలోకి రాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది.
మోహన్ బాబు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.







