గోడ కుర్చీ వేయడం.తప్పు చేస్తే ఇచ్చే పనిష్మెంట్ కాదండోయ్.
వ్యాయామాల్లో ఇదీ ఒకటి.అవును, రోజుకు కేవలం ఐదంటే ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ వేస్తే గనుక బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి ఇంకెందుకు ఆలస్యం గోడ కుర్చీ వేస్తే వచ్చే హెల్త్ బెనిఫిట్స ఏంటో ఓ లుక్కేసేయండి.
నేటి టెక్నాలజీ కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది తరచూ ఒత్తిడికి గురవుతుంటారు.
ఆ ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే చివరకు డిప్రెషన్కి దారి తీస్తుంది.అయితే ప్రతి రోజు ప్రశాంతమైన వాతావరణంలో ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ వేస్తే గనుక.
ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలన్నీ దూరమై మనసు ప్రశాంతగా మారుతుంది.
అలాగే పొట్ట చుట్టూ కొవ్వుతో ఇబ్బంది పడే వారు.రెగ్యులర్గా గోడ కుర్చీ వేయాలి.తద్వారా పొట్ట వద్ద ఉండే కండరాలు దృఢంగా మారి కొవ్వు క్రమ క్రమంగా కరుగుతూ ఉంటుంది.
వెన్ను నొప్పితో బాధ పడే వారికి కూడా గోడ కుర్చీ వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది.అవును, ప్రతి రోజు ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ వేస్తే గనుక వెన్నెముక గట్టిగా మారి.
నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.వెన్ను నొప్పితో
అంతే కాదు, రెగ్యులర్గా గోడ కుర్చీ వేయడం వల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది.
గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.కాళ్లలో ఉండే కండరాలు దృఢంగా మారి పిక్కలు గట్టి పడతాయి.
శరీరంలో క్యాలరీలు సైతం కరుగుతాయి.కాబట్టి, పెద్ద పెద్ద వ్యాయామాలు చేయ లేని వారు కనీసం రోజుకు ఐదు నిమిషాల పాటు గోడ కుర్చీ అయినా వేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు.
.